India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి పరారైన ఘటన MBNR జిల్లాలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో పంజాగుట్ట PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
కృష్ణానదిలో జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్ రోజురోజుకూ తగ్గుతోంది. జనవరి నెలాఖరులో 829 అడుగులు ఉన్న బ్యాక్ వాటర్ ప్రస్తుతం 811 అడుగులకు చేరుకుంది. దీంతో సాగునీటి అవసరాలకు ఇప్పటికే నీటి ఎత్తిపోతలు నిలిపివేయగా, కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు లేవని అధికారులు అంటున్నారు. మరోవైపు పంటలు ఎండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల నాయకులలో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 28న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రేపు ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు టెన్షన్‌తో ఉన్నారు. పైకి గెలుపు మీద ధీమాతో ఉన్నప్పటికీ లో లోపల మాత్రం ఆందోళనలో ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో మార్చి నెలాఖరు నాటికే ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం 9 దాటితే బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా 41.8 డిగ్రీల వరకు ఎండ తీవ్రత రికార్డు అయింది. కాగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యశాఖ పేర్కొంది.
రేపు ఉదయం 8గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళశాలలో చేపట్టే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో గెలుపునకు మ్యాజిక్ ఫిగరెంతనేది ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రారంభించక ముందుగా చెల్లుబాటయ్యే ఓట్లను అధికారులు గుర్తిస్తారు. ఆ తర్వాతే గెలుపుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ప్రకటిస్తారు. ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్‌తో ఎవరు మాయ చెయ్యబోతున్నారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లో ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ఈనెల 2న ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, లెక్కింపు సిబ్బంది ఉదయం 6.30 గంటల్లోగా రిపోర్టు చేయాలని ఆదేశించారు.
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలకు వచ్చిన త్రైమాసిక ఆదాయం రూ.2,62,58,346 సమకూరిందని ఆలయ ఈఓ పురేంద్ర కుమార్ తెలిపారు. 2024 సంవత్సరంలో ఆదాయం బాగా పెరిగిందన్నారు. ఉచిత బస్సుల ప్రయాణం కారణంగా భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. వివిధ ఆర్జిత సేవ హుండి అన్నదానం ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు.
విద్యా శాఖ ఆధ్వర్యంలో టెట్‌కు మార్చి 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా ఏప్రిల్ 10 వరకు గడువు ఉంది. కాగా ఉమ్మడి జిల్లాలో 13,266 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వారిలో దాదాపు 80% మందికి టెట్ లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. స్పష్టత లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు పని భారం ఎక్కువ, వేతనాలు తక్కువగా ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. 2017లో రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించి వారికి సపరేట్ స్టాండింగ్ రూల్స్ ఇచ్చారు. దీంతో ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు రకాల సర్వీస్ రూల్స్ కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 వేల మంది కార్మికులు ఉన్నారు.
నాగర్ కర్నూల్‌లో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి సమాధాన పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమవుతుందని డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నాగర్ కర్నూలు కేంద్రానికి 1,59753 సమాధాన పత్రాలు అందాయని వెల్లడించారు. ఏప్రిల్ 3- 10 వరకు నిర్వహించే మూల్యాంకనంలో 765 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.