Mahbubnagar

News March 31, 2024

MBNR: నేటితో ముగియనున్న ఇంటి పన్ను చెల్లింపు !

image

ఇంటి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ ద్వారా చెల్లించే విధానం నేటితో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మార్చి 31 వరకు ఇంటి పన్ను చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ఈ అవకాశం నేటితో ముగియనుంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.

News March 31, 2024

MBNR: జాతీయ రహదారిపై 5 అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం

image

అడ్డాకుల: జాతీయ రహదారి 44పై త్వరలో 5 అండర్‌ బ్రిడ్జిల పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అవి వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట, పెద్దమందడి మండలంలోని వెల్టూర్‌ స్టేజీ, మూసాపేట మండలంలోని వేముల స్టేజీ, జానంపేట బస్‌స్టాప్‌, భూత్పూర్‌ మండలంలోని శేర్‌పల్లి(బీ) వద్ద జాతీయ రహదారిపై అండర్‌ బ్రిడ్జిలను నిర్మించడానికి నిధులు మంజూరు చేయడంతో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

News March 31, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

✔నేడు ఏర్పాట్లు.. రేపటి నుంచి వరి ధాన్యం కొనుగోలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో నిఘా కట్టుదిట్టం.. పలుచోట్ల తనిఖీలు
✔అమ్రాబాద్: నేడు కరెంట్ కట్
✔త్రాగునీటి సమస్యలపై అధికారులు ఫోకస్
✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(SUN)-6:36, సహార్(MON)-4:50
✔నేడు పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. హాజరుకానున్న నేతలు
✔నేడు పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు

News March 31, 2024

వనపర్తి: భార్యను చంపిన భర్తకు రిమాండ్

image

భార్యను భర్త చంపిన ఘటన వనపర్తి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. CI నాగభూషణం రావు వివరాల ప్రకారం.. ఎద్దులగేరికికి చెందిన దంపతులు వెంకటేష్, మహేశ్వరి. భర్త ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య అనుమానంతో గొడవ పడేది. ఈనెల 15న రాత్రి గొడవ పడగా.. భార్య ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చంపేశాడు. శనివారం అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు CI తెలిపారు.

News March 31, 2024

యూడైస్ ప్లస్ నిర్వహణకు నిధులు మంజూరు

image

ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో 2023- 24 విద్యా సంవత్సరంలో యూడైస్ ప్లస్ నిర్వహణకు సమగ్ర శిక్ష నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.7,02,920 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.MBNR జిల్లాకు రూ. 1,66,974,GDWL జిల్లాకు రూ.1,46,308,WNPT జిల్లాకు రూ. 99,572,NGKL జిల్లాకు రూ.1,56,658,NRPT జిల్లాకు రూ.1,33,408 వంతున మంజూరయ్యాయి. ఈ నిధులతో పలు కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News March 31, 2024

గద్వాల: పోస్టల్ దరఖాస్తుకు ఏప్రిల్ 23 వరకు గడువు

image

ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న అధికారులు, పోలింగ్ రోజున ఓటు వేసే అవకాశం లేని కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్లు, ఇంటి వద్దనే ఓటు వేయడానికి ఏప్రిల్ 23లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆర్డీవో రామచందర్, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు ఉన్నారు.

News March 31, 2024

ఉండవల్లి: ఓటీపీ చెప్పడంతో రూ.83,286 స్వాహా!

image

ఉండవల్లి: ఓటీపీ చెప్పడంతో బ్యాంకు ఖాతాలో నగదు పోయిన ఘటనపై ఉండవల్లి PSలో శనివారం కేసు నమోదైంది. SI శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు రమాదేవి ఆన్లైన్‌లో వాచ్ బుక్ చేసింది. వెంటనే వద్దనుకుని రద్దు చేసేందుకు వివరాల కోసం వెతికింది. ఆర్డర్ రద్దు చేయాలంటే ఫోన్‌కి వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో అలాగే చేసింది. కొద్దిసేపట్లో ఆమె ఖాతాలో రూ.83,286 డ్రా అయ్యాయి.

News March 31, 2024

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు: ఎస్పీ

image

పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తెలిపారు. జిల్లాలో 6 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అక్రమంగా నగదు, మద్యాన్ని తీసుకెళ్తున్న వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

News March 31, 2024

వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నిరుద్యోగ, యువతీ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణలో మూడు నెలల పాటు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్,జర్దోసి, ఎలక్ట్రిషియన్, మొబైల్ సర్వీసింగ్,రిఫ్రిజిరేటర్, ఏసీ మరమ్మతుల్లో శిక్షణకు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 31, 2024

బాలానగర్: చేప గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

గొంతులో పచ్చి చేప ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికుల వివరాలిలా.. బాలానగర్‌ మండలం మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్‌(45) మోతిఘణపూర్‌ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. పట్టిన వాటిలో ఒక చేపను తినగా అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. సహచరులు దాన్ని తీసేలోపే అతనికి ఊపిరాడక మృతి చెందాడు.