India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెల్దండ మండలంలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి చెర్కూర్ గ్రామంలో ఏకంగా 10 ఇళ్లల్లో చోరీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోని బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల నగదు, తులంన్నర బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ రవి గ్రామాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కేర్ 133వ జయంతి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండలాల ప్రజాప్రతినిధులు, పాల్గొని అంబేద్కర్ గ్రహానికి నివాళులర్పించారు. జిల్లాలోని పలు గ్రామాలలో అంబేద్కర్ ఉత్సవాల శోభయాత్ర నిర్వహించి డీజే పాటలకు నృత్యాలు చేయనున్నారు.
ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
✏MBNR: మోదీని గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ
✏కాంగ్రెస్ లో చేరిన పలువురు BJP&BRS నేతలు
✏నేడుPU పరిధిలో ఎంఈడీ పరీక్ష రీషెడ్యూల్ విడుదల
✏పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✏BRS పార్టీని వీడే ప్రసక్తి లేదు: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
✏MBNR:పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి
✏తాగునీటి సమస్యలపై అధికారుల సమీక్ష
✏ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీలకు టెంట్లు మంజూరు.
ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా సొసైటీ అధికారులు తెలిపారు. మే 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఒక సెషన్, మ.2:30 నుంచి సా.5:30 వరకు మరో సెషన్ ఉంటుందని చెప్పారు. https://www .telanganaopenschool.org/ వెబ్ సైట్ లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
@ తెలకపల్లి: బావిలో దూకి మహిళా ఆత్మహత్య.
@ కల్వకుర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇద్దరికీ జైలు శిక్ష.
@అమ్రాబాద్:అక్రమ మద్యం పట్టివేత ముగ్గురిపై కేసు నమోదు.
@ మరికల్: అక్రమంగా తరలిస్తున్న మద్యం డబ్బులు పట్టివేత.
@ దౌల్తాబాద్: చంద్రకల్ చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ1.50 లక్షల పట్టివేత.
@ తాండూర్: హోటల్లో ఆత్మహత్య చేసుకున్న కోడంగల్ వాసి.
√MBNR: పాలమూరు ప్రగతి కాంగ్రెస్ తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి.
√MBNR:మోడీని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి: DK అరుణ.
√ మద్దూర్: BRSనువీడియో ప్రసక్తి లేదు: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం.
√ భూత్పూర్: DK అరుణ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి వెన్నుపోటు: దేవరకద్ర ఎమ్మెల్యే.
√ మక్తల్: సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జలంధర్ రెడ్డి.
√ కొడంగల్: రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు: సందీప్ కుమార్ సుల్తానియా.
చైత్రమాసం వసంత రుతువు, ఏప్రిల్ 22 పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం MBNR ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడప నున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం తెలిపారు. ఈనెల 21 సాయంత్రం 5 గంటలకు MBNR డిపో నుండి బస్సు బయలుదేరి ఏపీలోని కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, 22న సాయంత్రం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 94411 62588, 73828 27102 సంప్రదించాలన్నారు.
పాలమూరు ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం లోని వివిధ మండలాలలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు.
నరేంద్ర మోదీని తెలంగాణ ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం కొత్తకోట మండల కేంద్రంలో, మదనాపురం, అడ్డాకల్ మండలాల బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకుంటే ప్రజలు మోసపోతారని ధ్వజమెత్తారు.
Sorry, no posts matched your criteria.