India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సోమవారం చిన్నారెడ్డి అన్నారు. నాణ్యత కలిగిన విత్తనాలనే రైతులు కొనాలని సూచించారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే స్థానిక వ్యవసాయ అధికారులకు గాని, పోలీసులకు గాని సమాచారం చేరవేయాలి అన్నారు. వారిపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా రాజోలిలో 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వారులో 97.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో 84.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా దోనూర్లో 77.5 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 76.0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని బీజేపీకి అనుకూలంగా రాగా.. మరికొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. PUలో రేపు కౌంటింగ్ జరగనుంది. సీఎం ఇలాకా కావడంతో ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో నేడు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. MBNR, NGKL, వనపర్తి, నారాయణపేట, జిల్లాలలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి తగిన తర్వాత పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులకు ఎగ్జిట్ పోల్ ఫీవర్ పట్టుకుంది. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్‌లో NGKLలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుస్తారని, MBNRలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుస్తారని పలు సర్వేలు చెప్పాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎగ్జిట్ పోల్ టెన్షన్ పట్టుకుంది. MBNR స్థానంలో గెలుపోటములకు 2 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తోంది.
NGKLలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 7నెలల <<13363296>>గర్భిణి మృతి<<>> విషయం తెలిసిందే. తాడూరుకు చెందిన పద్మ(35)- మహేందర్ దంపతులకు 15ఏళ్ల క్రితం పెళ్లైంది. శనివారం వారి పెండ్లి రోజు కాగా రాత్రి బంధువులతో వేడుకలు జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం కడుపులో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆమె ప్రతినెల వెళ్లే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం వికటించి పద్మ మృతిచెందింది. ఆ ఆస్పత్రిని DMHO సుధాకర్‌లాల్ తనిఖీ చేసి సీజ్ చేశారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. వీరిలో 39,323 పాసయ్యారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా MBNR జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా, NRPT జిల్లాలో 526 మంది ఫెయిలయ్యారు. వీరందరూ నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫెయిలైన విద్యార్థులంతా పాసయ్యేలా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు DEO రవీందర్ తెలిపారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ ప్రత్యేక దృష్టిసారించారు. రేవంత్ MBNRలో నిర్వహించిన ఓ సభలో స్థానిక MLC ఉపఎన్నికలో జీవన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 12 మంది MLAలు ఉన్నప్పటికీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో నేతలు గప్‌చూప్‌గా ఉన్నారు. పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం మహబూబ్ నగర్ బీజేపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడ చూసినా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయని, మళ్లీ మోదీనే పీఎం కానున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం సైన్స్ చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్-1 ప్రయోగ తరగతులు(ప్రాక్టికల్ క్లాసెస్) ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాల, NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కల్వకుర్తి, నారాయణపేట, కొండనాగుల, జడ్చర్ల, షాద్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్టడీ సెంటర్లలో ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.