India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో 38 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన సంవత్సరం 60 వేల ఎకరాల్లో పంటను సాగు చేయగా.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 38 వేల ఎకరాలకే పరిమితమైంది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నేడు మరికల్ మండలం లాల్ కోట చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర మండలం గురకొండకి చెందిన బిరప్ప రూ.8 లక్షల 40 వేలు కారులో తీసుకెళ్తుండగా సీజ్ చేసి ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు వెంట ఉండాలన్నారు.
అచ్చంపేట మండలంలోని దుబ్బా తండాకు చేందిన కేతవత్ జవహర్(33) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నట్లు సిద్దాపూర్ SI పవన్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాలు.. గురువారం తన వ్యవసాయ పొలంలో స్థభానికి జవహర్ ఊరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో పొలానికి వెళ్లి జవహర్ సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి భార్య కవిత ఫిర్యాదుతో నేడు కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రభంజనం మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈసారి మోదీ ప్రభంజనంతో 400 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
CRPF జవాన్ విష్ణు మృతితో హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోల్‌కతా సరిహద్దుల్లో విధి నిర్వహణలో చనిపోయినట్లు వచ్చిన సమాచారంతో విష్ణు సోదరుడు శేఖర్ మరో ఇద్దరితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. అయితే విష్ణు 18నెలల క్రితమే ఈ ఉద్యోగం సాధించాడని, ప్రొబేషన్ పూర్తికాగా ఇటీవలే పోలీసులు వ్యక్తిగత వివరాలపై విచారణ జరిపారని ఇంతలోనే ఇలా జరిగిందని వారు వాపోయారు.
నాగర్ కర్నూల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి భరత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్లాలంటే మోదీని 3వ సారి ప్రధానిగా ఎన్నుకోవాలని, మోదీ తీసుకొనే అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే మహబూబ్‌నగర్ లోక్‌సభ రూపురేఖలు మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో ముడిపడి ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో మహహబూబ్‌నగర్ అభివృద్ధి చేసి చూపిస్తామని, ఆరు గ్యారంటీలను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు.
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల భవనంలో నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే పటిష్ఠ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏప్రిల్ 4 నాటికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగియనుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు మొదటి, రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండు, మూడో ప్రాధాన్యత ఓటు వేసినా ఆ ఓటు చెల్లదు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకు గానూ.. 1,437 ఓట్లు పోలయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు. మొదటి ప్రాధాన్యత ఓటుగా 720 ఓట్లు ఎవరికి పోల్ అయితే వారిదే విజయం.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. క్యాంపులకు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఓటు వేశారా లేదంటే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అనే అంశంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. విజయం సాధించాలంటే దాదాపు 725 ఓట్లు రావాల్సి ఉంది. ఫలితం కోసం ఏప్రిల్ 2 వరకు ఆగాల్సిందే.
Sorry, no posts matched your criteria.