Mahbubnagar

News March 29, 2024

దన్వాడ: తమ్ముడు మృతి.. పుట్టెడు దుఃఖంతో పరీక్ష హాలుకు

image

తమ్ముడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న విద్యార్థిని పరీక్షకు హాజరైంది. మరికల్‌కు చెందిన అనూషకు గురువారం పదో తరగతి సైన్స్ పరీక్ష ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముడు అర్జున్ మృతిచెందాడు. పరీక్షకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉండగా.. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఓదార్చి అనూషను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష రాయించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంది.

News March 29, 2024

MBNR: స్కాలర్షిప్ దరఖాస్తుకు చివరి అవకాశం

image

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31తో గడువు ముగియనుంది అని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని కొత్తవారు లేదా రెన్యువల్ చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు అధికారులు వివరించారు.

News March 29, 2024

హన్వాడ: CRPF జవాన్ దుర్మరణం

image

మండలంలోని వేపూర్‌కు చెందిన CRPF జవాన్ విష్ణు (26) మంగళవారం అర్ధరాత్రి కోల్‌కతా సరిహద్దుల్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరుడు శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో ఉండగా జరిగిన కాల్పుల్లో మృతి చెందాడని అక్కడి హెడ్ క్వార్టర్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News March 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు పాలమూరుకు కిషన్ రెడ్డి రాక ✔అచ్చంపేట:నేటి నుంచి రెండు రోజులు వ్యవసాయ మార్కెట్ బంద్ ✔గద్వాల్, వనపర్తి: పలు గ్రామాలలో కరెంట్ కట్ ✔పలు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు ✔నవాబుపేట: నేటి నుంచి మలక్ షా బాబా ఉర్సు ప్రారంభం ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(శుక్ర)-6:35,సహర్(శని):4:50 ✔త్రాగు నీరు, ఉపాధి హామీ పనులపై అధికారుల ఫోకస్

News March 29, 2024

కొత్తకోట: పోక్సో కేసులో యువకుడికి రిమాండ్

image

ఓ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన యువకుడిని కొత్తకోట పోలీసులు జైలుకు పంపించారు. SI మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాటవెల్లికి చెందిన ఓ బాలికను వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాగా బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.

News March 29, 2024

MBNR: MLC ఉప ఎన్నికలు.. గైర్హాజరు అయింది వీళ్లే!

image

మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 1,439 ఓట్లకు, 1,437 మంది సద్వినియోగం చేసుకున్నారు. ఇద్దరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్ గోడు బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర అనారోగ్యం కారణంగా, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల సర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారద అమెరికాలో ఉండటంతో ఓటుహక్కును వినియోగించుకోలేదు.

News March 29, 2024

MBNR: హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌‌కు ఉండగా.. భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు పోలింగ్‌ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News March 28, 2024

MBNR: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎంఈడి మొదటి, మూడవ సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల టైం టేబుల్‌ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 15 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపారు. టైం టేబుల్ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.

News March 28, 2024

MBNR: భారీ చోరీ.. 40 తులాల బంగారం, రూ.10లక్షలు అపహరణ

image

ఇంట్లో నుంచి భారీగా బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు పోయిన సంఘటన గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ బాయి కాలనీలో చోటు చేసుకుంది. యజమాని ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు సుమారు రూ.10 లక్షలు అపహరణకు గురైందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలలో జయం పై ఎవరి ధీమా వారిదే..!

image

ఎమ్మెల్సీ ఎన్నికలలో హోరాహోరీగా తలపడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం పై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ ప్రతినిధులు అధికంగా ఉన్నందున నా విజయం ఖాయం అంటూ నవీన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి సైతం విజయం పై ధీమాతో ఉన్నారు.