India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం జాతీయ రహదారిపై పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి 18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఏఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీలోని నంద్యాల నుంచి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు బొలెరో వాహనంలో 18 క్వింటాళ్ల లూజు విత్తనాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందన్నారు. డ్రైవర్ కోటేష్ పై కేసు నమోదు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జరీ చేయగా, ఆదివారం గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాల మేరకు ప్రజల ప్రమాదంగా ఉండాలని అధికారులు కోరారు.
✓ ఉమ్మడి జిల్లాలో నేటి నుండి ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభం.
✓ కొడంగల్, నందిగామ, ఫరూక్నగర్ మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత.
✓ పాలమూరులో నేడు హనుమాన్ జయంతి వేడుకలు.
✓ రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం.
✓ రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు ఏర్పాట్లు.
✓ అలంపూర్: నేడు పెద్ద కిస్తీ దర్గా ఉత్సవాలు.
✓ అచ్చంపేట: నేడు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన.
✓ నేడు TGPSC గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై రేపు ఉత్కంఠకు తెరపడనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉ.8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టేబుళ్లలో ఓట్లు లెక్కిస్తారు. మన్నె జీవన్ రెడ్డి(INC), నవీన్ కుమార్ రెడ్డి(BRS), స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఓ బాలుడు, ఇద్దరు మహిళలు, మరో యువకుడు ఉన్నారు. రహదారిపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రేపు HYD పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సోనియా గాంధీ, ఉద్యమకారులు, అమరుల కుటుంబీకులను భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమంలో KCR కీలకం కావడంతో CM రేవంత్ ఆయనకూ ఆహ్వానం పంపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మన్ హర్కర వేణుగోపాల్ ఇన్విటేషన్ అందించారు. మరి CM పిలుపుతో KCR వస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ సెమిస్టర్-4 రెగ్యులర్, బ్యాక్లాగ్, సెమిస్టర్-5 బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి రాజ్ కుమార్ తెలిపారు. జూన్ 6న జరిగే ఈ పరీక్షలను మే 18కి పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయా సెమిస్టర్ల విద్యార్థులు గమనించాలని కోరారు.
వారణాసిలో కొలువుదీరిన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం దర్శించుకున్నారు. ప్రధాని మోదీకి మద్దతుగా వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన డీకే అరుణ ప్రచారాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో కాశీ విశ్వనాథని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
✓ కొత్తకోట: లారీ ఢీకొని డీసీఎం క్లీనర్ మృతి.
✓NRPT:ఎరువులు విత్తనాలు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్.
✓MBNR: రాష్ట్ర చిహ్నాల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: మాజీ మంత్రి.
✓GHPU యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ గా కల్వకుర్తి వాసి నియామకం.
✓WNP:లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ శాఖ అధికారులు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం.
వనపర్తి జిల్లాలో ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. నేడు వనపర్తి ఎలక్ట్రిసిటీపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లు చెల్లించేందుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ. 19వేలు లంచం తీసుకుంటుండగా ట్రాన్కో SE నాగేంద్రకుమార్, DE నరేంద్ర కుమార్, AE మధుకర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఏసీబీ దాడులతో ఆయా అధికారులు భయపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.