India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 3,303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రాల సంఖ్య 4,004లకు చేరింది. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి. సగటున ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున కేంద్రాలు పెంచారు. ఏటా చనిపోయినవారు, స్థానికంగా లేనివారి ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా చాలామంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
MBNR బీజేపీ పార్టీ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ గురువారం హన్వాడ మండల స్థాయి బిజెపి పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుండి కార్యకర్తలు కష్టపడి పని చేసి బిజెపి గెలుపు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ధ్వజమెత్తారు. మరోసారి మోడీని ప్రధానిగా గెలిపించుకుందామన్నారు.
ధన్వాడ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య అభివృద్ధిపై మాటల యుద్ధం నడుస్తోంది. తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని హస్తం నేతలు, మోదీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కమలం నేతలు వాదనలకు దిగుతున్నారు. రెండు పార్టీలకు చెందిన లీడర్లు, ఆయా పార్టీల అభ్యర్థులు అభివృద్ధిపై ఒకరిపై మరొకరు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు సమాచారం.. బ్రిడ్డిపై మూలమలుపు ఉండటంతో బైక్ కంట్రోల్ కాకపోవడంతో కింద పడి మృతిచెందారు. మృతుడు లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన రాజలు(50)గా గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల నాయకులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై స్థానిక నాయకత్వం గట్టిగా పనిచేయించే బాధ్యతను పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేసిన వారికే ఆ తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో CNG వాహనాల వినియోగం పెరుగుతుంది. ధర తక్కువగా ఉండడం మంచి మైలేజీ రావడంతో CNG వాహనాలు వినియోగించేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. కిలో CNG ధర రూ.90 కాగా ఆటోలకు 40 కి.మీ, కార్లకు 32 కి.మీ మైలేజీ వస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా CNG కార్లు, ఆటోలు 2,037 ఉన్నాయి. CNG వాహనాలు అత్యధికంగా 920 మహబూబ్ నగర్ జిల్లాలో, అత్యల్పంగా 192 నారాయణపేట జిల్లాలో ఉన్నాయి.
శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్ 29.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34 టీఎంసీల నీరు ఉంది.. మరో 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం నెలకు 0.8 టీఎంసీల అవసరం ఉంటుందని తెలిపారు. జలాశయం 800 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని అన్నారు.
బిజినేపల్లి మండలం గంగారం ఫారెస్టులో అరుదుగా కనిపించే ఆసియన్ ఫాం సీవెట్ క్యాట్ గాయపడి సృహ కోల్పోయిన స్థితిలో భీముడి తండా వాసులకు కనిపించింది. సమాచారం అందుకున్న గంగారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంటి, బీట్ ఆఫీసర్ మోహన్లు సీవేట్ క్యాట్ ను స్వాధీనం చేసుకొని పశు వైద్యాధికారితో చికిత్స అందించారు. అడవిలో నుంచి నీటి కోసం వచ్చిన దాన్ని గుర్తుతెలియని జంతువులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు తెలిపారు.
వనపర్తి జిల్లాలో రాజపేట సమీపంలో జరిగిన <<13027779>>రోడ్డు ప్రమాదంలో ఇద్దరు<<>> ఉద్యోగులు చనిపోయారు. జడ్చర్ల మండలం అలూరుకు రవికమార్, MBNR జిల్లా ధర్మాపూర్‌కు చెందిన వెంకటయ్య మిత్రులు. గద్వాల పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా చేస్తున్న రవి.. వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా పనిచేస్తున్న వెంకటయ్యతో కలిసి బైక్ పై MBNR వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజపేట శివారులో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఉమ్మడి జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. తాగునీటికి ఇబ్బందులు ఉన్న పట్టణాలు, గ్రామాలు, ఆవాసాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే మరమ్మతులకు గురైన బోరు బావులు, చేతిపంపులు యుద్ధప్రతిపాదికన బాగు చేయించాలని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.