India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. టైగర్ ఫారెస్ట్ ను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా చేయాలని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఒకసారి వాడి పడేసే కవర్ల వలన ఫారెస్ట్‌లో నివసించే జంతువులకు హాని జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా సైనిక దళాలలో పనిచేసే సైనిక ఓట్లు లెక్కించిన అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 8:30 నిమిషాలకు కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత ప్రతి అరగంటకు ఒకసారి ప్రతి రౌండ్ ఫలితం వెలువడనుంది. ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఫలితంపై ఉదయం 11 గంటల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
✓NGKL: ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు.
✓MBNR:అయోధ్య రాముడిని దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి డీకే అరుణ.
✓NGKL:జూన్ 3 నుండి జిల్లాల్లో బడిబాట:DEO.
✓GDL:జూన్ 2న ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలి:కలెక్టర్.
✓NGKL:అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలించిన కలెక్టర్.
✓ ఉమామహేశ్వరుడిని దర్శించుకున్న అచ్చంపేట, చొప్పదండి ఎమ్మెల్యేలు.
✓MBNR:EVM స్ట్రాంగ్ రూములను పరిశీలించిన ఎస్పీ.
పరీక్షల్లో ఫెయిలైందని ఓ మెడికో సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్‌లోని రైతు కాలనీలో RMP వైద్యుడు బుచ్చిబాబు కుటుంబంతో పాటు ఉంటున్నారు. అతడి భార్య GOVT టీచర్. కాగా ఆయన కూతురు కీర్తి(24) ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. మరో కూతురు HYDలో చదువుతుండగా ఈరోజు తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి కీర్తి ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.
నాగర్ కర్నూల్ సమీపంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో వచ్చే నెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, NGKL జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు కలెక్టర్లు సూచించారు.
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మార్చి 28న ఎన్నిక జరగ్గా ఆటు ఆయా పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. సీఎం ఇలాక కావడంతో ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల బరిలో మన్నే జీవన్ రెడ్డి(INC), నవీన్ కుమార్ రెడ్డి(BRS) హోరాహోరీగా తలపడ్డారు. జూన్ 2న MBNRలోని బాలుర జూ. కాలేజీలో ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది.
ప్రసవం కోసం వచ్చిన గర్భిణి బాత్రూంలోనే బిడ్డకు జన్మనివ్వడంతో పసికందు మృత్యువాత పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వెలుగుచూసింది. స్థానికుల సమాచారం.. తాడూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(26) పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆమె ఒంటరిగానే బాత్రూంకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ప్రసవించడంతో శిశువు చనిపోయింది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరో 6 రోజుల్లో వెలువడనుంది. లెక్కింపు జూన్ 4 సమీపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎలాంటి తీర్పు వెలువడనుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల అధినేతలతో పాటు ప్రధాన నేతల గెలుపోటములపై ఒక్కొక్కరు రూ.లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారట. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ‘కాయ్ రాజా కాయ్’ జోరుగా సాగుతోందట.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు TGPSC కీలక సూచనలు చేసింది. జూన్ 9న ఉ. 10.30 నుంచి మ.1 వరకు పరీక్ష జరుగుతుందని, 10 గంటలకల్లా గేట్లు మూసేస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దని, షూస్ వేసుకోవద్దని, పరీక్ష పూర్తయ్యే వరకు బయటికి వెళ్లేందుకు కుదరదని పేర్కొంది. మెహెందీ, టాటూలు వేసుకోవద్దని.. విలువైన వస్తువుల్ని వెంట తెచ్చుకోవద్దని తేల్చి చెప్పింది.
కుక్కను తరుముతూ మరోమారు చిరుత ప్రత్యక్షమైంది. అదిచూసి భయంతో రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. కొండాపూర్‌లో ఆంజనేయులు రాత్రి పశువులకు మేత వేయడానికి వెళ్లగా తన కుక్క అరవడంతో లైట్ వేశాడు. కొద్ది దూరంలో చిరుత నిలబడి కనిపించింది. దీంతో ఆయన భయంతో పక్కనే ఉన్న కృష్ణయ్య, రాములు వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వారికి చెప్పడంతో వాళ్లు వచ్చే సరికి చిరుత కనిపించలేదు. అక్కడ ఉండకుండా ఇళ్లకు చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.