India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన దేవరకద్రలో చోటుచేసుకుంది. SI నాగన్న వివరాలు.. కోడూరు గ్రామానికి చెందిన వాకిటి శివకుమార్(22), హరిజన్ గణేష్(20) ఇద్దరు స్నేహితులు ఈరోజు కన్నయ్య బావి దగ్గరకు ఈతకు వెళ్లారు. శివ కుమార్ బావిలోకి దిగి ఈత కొడుతుండగా గణేష్ కూడా మెల్లగా బావిలోకి దిగాడు. గణేష్‌కు ఈత రాక మునిగిపోతుండగా శివకుమార్ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ మునిగి చనిపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికార అహంతో రేవంత్ రెడ్డి విర్ర వీగుతున్నాడని.. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్ లాగా అవుతారని పేర్కొన్నారు. ‘అరుణమ్మను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. రైతుల అభివృద్ధి కోసం అరుణమ్మ పనిచేసింది. కాంట్రాక్టర్ల కోసం, పదవుల కోసం బిజెపిలో చేరలేదు’ అని అన్నారు.
MBNR: చౌకధర దుకాణాల్లో ఇక నుంచి చక్కెర తప్పనిసరిగా పంపిణీ చేయాలని డీలర్లను పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఉచిత బియ్యంతోపాటు పంచదార ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 చౌక దుకాణాలు ఉన్నాయి. AAY లబ్ధిదారులు 68,875 మంది ఉన్నారు. వీరికి ప్రతినెల కిలో చొప్పున చక్కెర పంపిణీ చేయాలంటే ఉమ్మడి జిల్లాకు గోదాము నుంచి 96.88 టన్నుల దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
వనపర్తి: మే 24న పాలీసెట్-2024 రాత పరీక్ష ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుందని, గణితం 60 నిమిషాలు, భౌతిక శాస్త్రం 30 నిమిషాలు, రసాయన శాస్త్రం 30 నిమిషాల వ్యవధిలో జవాబులు రాయవలసి ఉంటుందని అన్నారు. 9,10 వ తరగతి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యం ఆరబోతకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ యాసంగిలో 4,78,649 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 8.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలు కలగానే మిగిలాయి. ధాన్యం ఆరబోతకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి కల్లాల నిర్మాణాలను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఈనెల 15 నుంచి 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 4,187 పాఠశాలల్లో 1-9 వరకు చదువుతున్న 4,81,554 నుంచి విద్యార్థులు ఎస్ఏ-2 పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు డీఈవోల ఆధ్వర్యంలో సంబందిత జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ద్వారా ప్రశ్నపత్రాలు సరఫరా చేశారు.
బిజినేపల్లిలో డివైడర్‌ను తుఫాన్ ఢీకొట్టిన ఘటనలో మృతులు వసుంధర, భారతిగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉగాది సందర్భంగా కర్ణాటకకు చెందిన 13 మంది భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డివైడర్ అసంపూర్తి, సూచికబోర్డులు లేక ఎన్నో ప్రమాదం జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
భద్రాచలం శ్రీరాముడి తలంబ్రాలు నేరుగా ఇంటికే అందించనున్నట్లు ఆయా డిపోల ఆర్టీసీ డీఎంఈలు తెలిపారు. రూ.151 చెల్లించి ఈనెల 18 వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
1.మహబూబ్ నగర్-91542 98612
2.నాగర్ కర్నూల్-96189 65885
3.కోస్గి-63051 09009
4.గద్వాల్-91542 98609
5.అచ్చంపేట-91542 98608
6.కల్వకుర్తి-91542 98610
7.కొల్లాపూర్-91542 98611
8.నాగర్ కర్నూల్-91542 98613
నారాయణపేట జిల్లా రద్దు అవుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి స్పందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అలాంటి ఆలోచన లేదన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు అని స్పష్టం చేశారు. జీఓ69 ఓ కల అని, అది రేవంత్ రెడ్డి సారథ్యంలో జీఓ14 ద్వారా నెరవేరుతుందన్నారు.
MBNR, NGKL లోక్ సభ పరిధిలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. MBNR పరిధిలో పురుషులు 8,28,944 మంది ఉండగా మహిళలు 8,46,308 మంది ఉన్నారు. NGKL లోక్ సభ పరిధిలో పురుషులు 8,61,980 మంది ఉండగా మహిళా ఓటర్లు 8,69,803 మంది ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 25,187 మంది అధికంగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.