Mahbubnagar

News May 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా నవబ్ పేటలో 39.9 డిగ్రీలు నమోదైంది. గద్వాల జిల్లా అలంపూర్‌లో 39.1, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 38.8, వనపర్తి జిల్లా దగడలో 38.6, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 38.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 29, 2024

MBNR: బీసీ గురుకులాల్లో చేరేందుకు ఈనెల 30 LAST DATE

image

ఉమ్మడి జిల్లాలోని 25 బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు ఈనెల 30లోగా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరాలని బీసీ గురుకులాల సమస్వయకర్త వెంకట్ రెడ్డి తెలిపారు. MJP బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు పాఠశాలలు కేటాయించారు. కావున ఎంపికైన వారు తమ ధ్రువ పత్రాలతో ఈనెల 30లోగా కేటాయించిన పాఠశాలలో చేరాలని కోరారు.
SHARE IT

News May 29, 2024

MBNR: ప్రకృతి పగ.. గాలివానతో కుటుంబాల్లో విషాదాలు!!

image

అకాల వర్షాలు, అనుకోకుండా వచ్చే ఈదురు గాలులు ఉమ్మడి జిల్లాలో విషాదం నింపుతున్నాయి. పది రోజులుగా ఈదురు గాలులతో కురుస్తున్న భారీ వర్షాల్లో పిడుగులు పడి రైతులు, రైతు కూలీలతో పాటు ఎన్నో మూగజీవాలు మృతి చెంది అనేక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను నేలమట్టం చేసి, పిడుగులు ఈదురుగాలులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

News May 29, 2024

UPDATE: MBNR: బస్సు, బైక్ ఢీ.. ముగ్గురు మృతి

image

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి-167పై మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ వెళ్తున్న కర్ణాటక <<13331578>>బస్సు, బైక్<<>> ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్(29), రాఘవేంద్రచారి(30) అక్కడికక్కడే మృతి చెందగా.. మహేష్(21) కాలు విరిగి తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో MBNRకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

News May 29, 2024

MBNR: గండీడ్ మండలంలో చిరుత కలకలం

image

గండీడ్ మండలంలోని ఆశిరెడ్డిపల్లి శివారులో మంగళవారం ఉదయం చిరుత కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ శివారులో కోరాళ్లగుట్టపై నుంచి కిందకు వస్తున్న చిరుతను అక్కడే ఉన్న వెంకటయ్య చూసి వెంటనే సమీప పొలాల రైతులు, గ్రామస్థులకు సమాచారమిచ్చారు. నాలుగైదు రోజులుగా కొండాపూర్, రంగారెడ్డిపల్లి, లింగాయపల్లి శివారుల్లో చిరుత సంచరిస్తూ మేకలను చంపితినేస్తుంది. తాజాగా ఆశిరెడ్డిపల్లి అటవీలో కనిపించింది.

News May 29, 2024

వనపర్తి: గ్రూప్1 అభ్యర్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్ : కలెక్టర్

image

జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం లేదా మరేదైనా సందేహాల నివృతి కోసం కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జూన్ 8 ఉ.10 నుంచి సా. 6 వరకు తిరిగి 9న ఉ. 6 నుంచి మ. 2 వరకు 08545-233525 సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సందేహాలనివృత్తికి అభ్యర్థులు హెల్ప్‌లైన్ నంబరు‌ను వాడుకోవాలన్నారు.

News May 28, 2024

MBNR: ప్రైవేట్ వ్యక్తులు ఆర్టీవో కార్యాలయంలో విధులు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు మంగళవారం తెలిపారు. నేడు ఏసీబీ అధికారులు ఆర్టీవో కార్యాలయంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముగ్గురు పట్టుబడ్డారు. ఎలాంటి అధికారం లేకున్నా అధికారులతో కుమ్మక్కై విధులు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News May 28, 2024

నాగర్‌కర్నూల్: చిన్నారుల మృతి.. రీజన్ ఇదే!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. నీటిగుంతలో నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన 3 చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడ్డారు. చిన్నారుల అర్తనాదాలు విన్న స్థానికులు గుంత దగ్గరికి వెళ్లి ఒకరిని బయటికి తీయగా ఇద్దరు <<13332379>>చిన్నారులు<<>> మహమ్మద్ ఫుర్ఖాన్ (10) , మహమ్మద్ హుస్సేన్ (13) నీటమునిగి మృతిచెందారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

News May 28, 2024

నాగర్‌కర్నూల్: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

image

నాగర్‌కర్నల్ జిల్లా బిజినేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. వారి మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 28, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా గట్టులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో 38.6, నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 38.1, వనపర్తి జిల్లా దగడలో 37.7, నాగర్ కర్నూల్ జిల్లా జెట్‌ప్రోల్‌లో లో36.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

error: Content is protected !!