Mahbubnagar

News April 9, 2024

MBNR: ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలో పాల్గొన్న పార్టీ నేతలు

image

ఉగాది పండగ సందర్భంగా నేడు శిల్పారామంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పండితులు పార్టీ నేతల జాతకాన్ని వివరించారు. అనంతరం నాయకులను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 9, 2024

MBNR: ఓటు నమోదుకు మరో అవకాశం

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండగా ఎన్నికల కమిషన్ ఓటు నమోదుకు మరో అవకాశం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు కారణాలతో ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం మరో అవకాశం ఈ నెల 15 వరకు ఓటరుగా నేరుగా ఆన్‌లైన్ లేదా బూత్ స్థాయి అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవడానికి గడువు పెంచింది. ఈనెల 15 వరకు వచ్చిన దరఖాస్తులు అన్నింటిని నమోదుకు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

News April 9, 2024

MBNR: పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్నాడు..!

image

యువతిని పెళ్లి చేసుకోనని ఓ యువకుడు గొంతు కోసుకున్న ఘటన HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాలు.. RR జిల్లా కడ్తాల్ వాసి అశోక్(21) దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. అతడికి అచ్చంపేటకు చెందిన యువతి(19) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెను ప్రేమ పేరిట లోబర్చుకుని మొఖం చాటేయడంతో PSలో ఫిర్యాదు చేసింది. ఆమెను పెళ్లి చేసుకోనని అశోక్ గొంతు కోసుకున్నాడు.

News April 9, 2024

MBNR: జిల్లాలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం

image

ఉమ్మడి MBNR జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి రెండు ఎంపీ స్థానాలపై గురి పెట్టారు. నిన్న కొడంగల్‌లో పర్యటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

News April 9, 2024

MBNR: తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడి క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గోకారంకు చెందిన బాదగోని అల్లాజి (52) మద్యానికి బానిస కావడంతో భార్య మల్లమ్మ వారించి చెప్పగా వారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 9, 2024

MBNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులు, మహిళలకు లాజిస్టిక్ విభాగాల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్టు నిర్వాహకులు కోటిరెడ్డి తెలిపారు. అర్హులైన మహిళలు భూత్పూర్ పురపాలికలోని అమిస్తాపూర్ కేంద్రంలో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 9, 2024

బిజినేపల్లి: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది బిజినేపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని వస్రాంతండాలో సోమవారం లేగదూడపై చిరుత దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… తండాకు చెందిన ఆంబోతు రాముడు అనే రైతు గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ఆవు దూడను చిరుత దాడి చేసి చంపింది అన్నారు. చిరుత సంచారంతో ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే భ‌య‌మేస్తోంద‌ని గ్రామ‌స్తులు వాపోయారు.

News April 9, 2024

MBNR: మైనారిటీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..APPLY చేసుకోండి

image

యూపీఎస్సీ సి-సాట్-2025 పరీక్షపై రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, సంక్షేమ శాఖ HYDలో ఉచిత శిక్షణకు ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పూర్తిచేసిన మైనారిటీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి రవీంద్రనాథ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు www.tmreistelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News April 8, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥NGKL:బహుజన లెఫ్ట్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బాలస్వామి
♥కేటీఆర్ నాగర్ కర్నూల్ పర్యటన వాయిదా
♥GDWL:రాష్ట్రంలో BRS లేదు.. దేశంలో కాంగ్రెస్ లేదు:DK అరుణ
♥NRPT:మూడురోజుల్లో హత్యకేసు ఛేదించిన పోలీసులు
♥సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు
♥ప్రజలు పార్లమెంట్ ఎన్నికలకు సహకరించాలి:SP
♥’ఇఫ్తార్ విందు’లో పాల్గొన్న SPలు,స్థానిక MLAలు
♥ప్రజావాణి లో ఫిర్యాదులు..సమస్యలపై ఫోకస్

News April 8, 2024

గద్వాల: రాష్ట్రంలో BRS లేదు.. దేశంలో కాంగ్రెస్ లేదు: డీకే అరుణ

image

గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో సోమవారం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో నియోజకవర్గ బీజేపీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS లేదు.. దేశంలో కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్, BRSకు ఓటువేస్తే నదిలో వేసినట్టే అని ఎద్దేవా చేశారు.