India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నువ్వా.. నేనా.. అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్‌లుగా తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. BRS సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కాగా.. కాంగ్రెస్ సైతం పట్టు వదలకుండా పావులు కదుపుతోంది.
GDWL: ఈనెల 26 నుంచి ఎస్సీ నిరుద్యోగులకు 3నెలల పాటు గ్రూప్స్ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి శ్వేతా ప్రియదర్శిని తెలిపారు.30 బ్యాక్ లాగ్ అడ్మిషన్ల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు గద్వాలలోని రెండో రైల్వేగేట్ సమీపంలోని టీటీఎన్ భవనం బీసీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అమ్రాబాద్ : నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్) పరిధిలో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వీటి సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. అమ్రాబాద్ అభయారణ్యంలో మాత్రం పెరగడం గమనార్హం. దేశవ్యాప్తంగా చిరుతల గణాంకాల నివేదికను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో 173 చిరుతలు ఉన్నాయి.
తాను నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లురవి అన్నారు. సోమవారం వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందని తాను గెలిస్తే అభివృద్ధి చేస్తానన్నారు. రైల్వే సదుపాయానికి కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు
జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో జోగుళాంబ గద్వాల జిల్లాకు తాగునీటి గండం పొంచి ఉందని చెప్పొచ్చు. ఈ ఏడాది కృష్ణాబేసిన్‌లో వర్షాలు తక్కువగా కురవడంతో ప్రాజెక్టులలో తగినన్ని నీటి నిల్వలు లేవు. దీంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా.. రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినప్పటికీ రోజు రోజుకు మండుతున్న ఎండలకు జూరాలలోని నీటి నిల్వలు పడిపోతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2017 సంవత్సరంలో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేసింది. NGKL జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారిగా ఉన్న అంజిలప్ప, ఏడీ కేశవసాయి ఏసీబీ అధికారులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. వీరు ఉమ్మడి జిల్లాలో 4 సంవత్సరాల పాటు పనిచేశారు. వీరి హయాంలో జరిగిన గొర్రెల యూనిట్ల పంపిణీ ఏమైనా అవినీతి జరిగిందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రికార్డులను తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఒకప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్.. తాజాగా ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఈమేరకు వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్ రాజోలు టికెట్ ఖరారు చేశారు. ఆయన 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ MD, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా సేవలందించారు.
జాతీయ మదింపు గుర్తింపు మండలి న్యాక్ గ్రేడ్ సాధనలో ఉమ్మడి జిల్లాలోని పీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. న్యాక్ గుర్తింపులో ఇప్పటివరకు గ్రేడ్ బి++ మాత్రమే ఉండగా జడ్చర్లలోని డా. బిఆర్ఆర్ డిగ్రీ కళాశాల తొలిసారిగా న్యాక్ ఎ-గ్రేడ్ సాధించింది. ఇది ఉమ్మడి జిల్లా చరిత్రలో ఓ నూతన అధ్యాయనమని చెప్పొచ్చు. న్యాక్ గుర్తింపు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కళాశాలలకు నిధులు కేటాయిస్తుంది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు అధికారి ఫ్లోరెన్స్ రాణి తెలిపారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు నుంచి మ. 1గంట వరకు ఉంటుందని చెప్పారు.
నారాయణపేటలో హోలీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నీటి ట్యాంకు కూలి పడి సాయి ప్రణతి(13) అనే చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానిక గోపాల్‌పేట వీధిలో కామ దహనం చేసిన సందర్భంగా నీటి ట్యాంకు మంటల వేడికి గురి కాగా.. ట్యాంకు వద్ద నీటిని పట్టుకునేందుకు వెళ్లిన చిన్నారులపై ట్యాంకు కూలి పడటంతో ఘటన జరిగింది. చిన్నారి మృతితో పండగపూట విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.