Mahbubnagar

News March 25, 2024

NGKL: ఉపాధి కోసం వెళ్లి కొడుకును పొగొట్టుకున్నారు !

image

ఒంటిపై వేడినూనె పడి <<12918373>>చిన్నారి జయదేవ్‌<<>>(3) మృతి వెల్దండ మండలం బండోనిపల్లిలో విషాదం నింపింది. అర్జున్‌, శారదమ్మ దంపతులు జాతరల్లో స్వీట్లు, తినుబండారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమనగల్లు వేంకటేశ్వరస్వామి జాతరలో స్వీట్లు విక్రయించేందుకు పిల్లలతో సహా వెళ్లారు. స్వీట్లు చేస్తుండగా జయదేవ్‌ ఒంటిపై నూనెపడి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కళ్లముందే చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 

News March 25, 2024

మహబూబ్‌నగర్: రేపు పీయూలో ప్రపంచ సాహిత్యంపై కార్యశాల

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 26న ‘నాల్గో ప్రపంచ సాహిత్యం’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒకరోజు కార్యశాల నిర్వహిస్తున్నట్లు పీయూ ఆంగ్ల విభాగాధిపతి డా. మాళవి తెలిపారు. మంగళవారం అకాడమిక్ బ్లాక్ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న స్కాలర్స్, అధ్యాప కులు, వివిధ విభాగాధిపతులు హాజరుకావాలని కోరారు.

News March 25, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్రాస్ ఓటింగ్ భయం !

image

మహబూబ్‌‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఓటర్లు చేజారిపోకుండా అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అటు కాంగ్రెస్ అభ్యర్థికి.. ఇటూ బీఆర్ఎస్ అభ్యర్థికి తమ ఓటు మీకే అంటూ ఓటర్లు సంకేతాలు పంపిస్తున్నారట. ఈ క్రమంలో ఓటర్లు చేజారకుండా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్‌కు ఇంకా 4 రోజులే ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లపై గట్టి నిఘా పెట్టారు.

News March 25, 2024

MBNR: కలర్ పడుద్ది.. కళ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు ఈ వేడుక జరుపుకొనేందుకు పాలమూరు ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

News March 25, 2024

మహబూబ్‌నగర్: MLC ఎన్నిక పోలింగ్ కేంద్రాల వివరాలు

image

✓MPDO కార్యాలయం, MBNR – 245 మంది ఓటర్లు
✓MPDO కార్యాలయం, కొడంగల్ – 56 ఓటర్లు
✓MPDO కార్యాలయం, NRPT – 205 ఓటర్లు
✓RDO ఆఫీస్, వనపర్తి – 218 ఓటర్లు
✓ZP కార్యాలయం, GDL – 225 ఓటర్లు
✓బాలికల జూనియర్ కళాశాల, కొల్లాపూర్ – 67 ఓటర్లు
✓బాలుర ZPHS, NGKL – 101 ఓటర్లు
✓బాలికల ZPHS, అచ్చంపేట – 79 ఓటర్లు
✓ప్రభుత్వ జూనియర్ కళాశాల, కల్వకుర్తి – 72 ఓటర్లు
✓MPDO కార్యాలయం, షాద్నగర్ – 171 ఓటర్లు
✓మొత్తం ఓటర్లు – 1439.

News March 25, 2024

గద్వాల: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బతో ఉపాధి కూలీ చనిపోయిన ఘటన ఎర్రవల్లి మండలంలో జరిగింది. వల్లురుకు చెందిన చిన్నకృష్ణ(55) శనివారం ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చూపించారు. రాత్రి భోజనం చేసి పడుకున్న అతను తెల్లారేసరికి మృతిచెందాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎండల తీవ్ర నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

News March 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు..!

image

✏MBNR:నేడు మన్యం కొండాలో అలివేలు మంగతాయారు ఉత్సాహాలు
✏గద్వాల్:పలు మండలాలలో కరెంట్ కట్
✏నేడు హోలీ.. పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✏యాసంగి వరి ధాన్యం.. కొనుగోలుకు కసరత్తు
✏MLC ఎన్నికలు.. ఓటర్లపై ఫోకస్
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(MON)-6:36,సహార్(TUE):4:56
✏’ELECTION-EFFECT’.. పలుచోట్ల తనిఖీలు
✏బాలానగర్:తిరుమల నాథ స్వామి వేడుకలు షురూ
✏ఉమ్మడి జిల్లాలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
✏త్రాగునీటిపై సమీక్ష

News March 25, 2024

MBNR: ‘మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం’

image

మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5,6,7వ తరగతుల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని భగీరథ కాలనీలోని గురుకుల పాఠశాల-3 ప్రిన్సిపల్ కె.సురేఖ తెలిపారు. నాల్గో తరగతి చదువుతున్న దరఖాస్తు చేసుకోవాలని, 80 సీట్లలో 60 ముస్లింలకు, 20 రిజర్వేషన్ ప్రాతిపాదికన భర్తీ చేశామన్నారు. 6, 7వ తరగతుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు.

News March 25, 2024

MBNR: మహిళా సంఘాలకు రూ.25.73 కోట్లు మంజూరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా సంఘాలకు ఊరట లభించింది. ప్రభుత్వం వారి ఖాతాల్లో కొన్ని నెలలకు సంబంధించిన వడ్డీ నగదును మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.25.73 కోట్లు మంజూరు కాగా నేరుగా స్వయం సహాయక సంఘాల సేవింగ్ ఖాతాల్లో ఈ నిధులను జమ చేస్తున్నారు. అయితే మొత్తం కాకుండా కేవలం మూడు నెలలకు సంబంధించిన రాయితీని మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.

News March 25, 2024

వనపర్తి: వికలాంగుల రాష్ట్ర నూతన కమిటీలో చోటు

image

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) ఆధ్వర్యంలో మహిళా దివ్యాంగుల సదస్సు హైదరాబాదులో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీలో వనపర్తి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు లక్ష్మీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా NPRD జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ స్వామి, శ్యాంసుందర్ రెడ్డి, మీసాల మోహన్ ప్రభాకర్ శెట్టి, గట్టన్న, భాగ్యలక్ష్మి,, మంగమ్మ హర్షిస్తూ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు.