India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాండూరులోని బీసీ శ్మశానవాటికలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కోస్గి మం.గుండుమల్‌కు చెందిన తిరుపతమ్మ(40)ని పదేళ్ల క్రితం భర్త వదిలేశాడు. తాండూరులోని తన అక్క ఇంట్లో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తుంది. శుక్రవారం పనికి వెళ్ళిన తిరుపతమ్మ ఇంటికి రాలేదు. శనివారం మృతదేహం గుర్తించిన పోలీసులు సుజాత సోదరికి సమాచారం అందించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన సుభాశ్ రెడ్డి ఈ రోజు ఉదయం తన ఇంట్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఇంట్లో మంటలు రావడంతో గమనించిన స్థానికులు అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్ (48) విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్ గన్‌తో సూసైడ్ చేసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
అమరచింత మండలంలోని ఈర్లదిన్నె గ్రామానికి చెందిన జయమ్మ(45) శనివారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. ఈనెల 4న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.
✏GDWL& మద్దూర్: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్ ✏త్రాగునీటి సమస్యలపై అధికారుల చర్యలు ✏పలు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు ✏కల్వకుర్తి: నేడు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ✏ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’ ఏర్పాటు& చలివేంద్రాలు ప్రారంభించనున్న అధికారులు ✏నేడు, రేపు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ✏పకడ్బందీగా కొనుగోలు కేంద్రాలు.. అధికారుల ఫోకస్ ✏కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ
తాగి గొడవ పడుతూ.. డబ్బుల కోసం వేధిస్తున్నాడని భార్య భర్త గొంతు కోసిన ఘటన మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో చోటుచేసుకుంది. SI వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హుస్సేన్ శుక్రవారం రాత్రి భార్య అలివేలును డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. విసుగు చెందిన భార్య ఈల పీటతో గొంతు కోసింది. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్ తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మూడు పదవ తరగతి, నాలుగు ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
✒‘కాంగ్రెస్ జన జాతర’ సభకు తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు,శ్రేణులు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా BRS నాయకుల “రైతు దీక్ష”
✒పెబ్బేర్:జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
✒BJPకి 400 సీట్లు పక్కా:DK అరుణ
✒పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా !
✒తలకిందులుగా తపస్సు చేసిన BRSకు ఒక్క సీటు రాదు:మంత్రి జూపల్లి
✒ఉమ్మడి జిల్లాలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✒నేడు ‘షబ్-ఎ- ఖాదర్’..రాత్రంతా జాగారం
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన సంఘటన నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపర్డెంట్ రంజిత్ మాట్లాడుతూ.. కొల్లంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ మొదటి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షించిన అనంతరం సాధారణ ప్రసవంలోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఒకరు మగ బిడ్డ ఇద్దరు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నర్సులు ఉన్నారు.
రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కోయిలకొండ బిజెపి నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రథమ స్థానంలో నిలిపిన నరేంద్ర మోడీకి తప్ప ఇంకెవరికి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని అన్నారు. రాహుల్ గాందీ తన సమయాన్నివృథా చేయడం తప్ప, తను అనుకున్నది ఏమి జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రాంత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.