India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆమనగల్లులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ నెల 24న పాలిసెట్-2024 నిర్వహిస్తోంది. ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 10,470 మంది విద్యార్థులకు 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.11 నుంచి మ.1.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొత్తకోటకు చెందిన ఫాతిమా బేగం MBNR బస్టాండులో బస్సు ఎక్కి ఆరు తులాల బంగారం నగలు గల బ్యాగును బస్సులో మరిచిపోయి జడ్చర్ల బస్టాండులో దిగిపోయింది. ఆ బ్యాగును తీసుకున్న కండక్టర్ ఫర్జానా డిపోలో అప్పగించింది. బ్యాగును కల్వకుర్తి డిపో మేనేజర్ సుభాషిణి సమక్షంలో సదరు ప్రయాణికురాలికి అప్పగించారు. దీంతో నిజాయితీ చాటుకున్న కండక్టర్, డ్రైవర్ కృష్ణ నాయక్‌ను అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు.
ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం పీఎం ఫసల్ బీమా యోజన పథకంపై మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటనష్టం జరిగినప్పుడు బీమా రైతులకు రిస్క్ కవరేజ్ కల్పిస్తుందని అన్నారు.
ఫారుక్‌నగర్ మండలం అన్నారం తండాలో గురువారం విషాదం నెలకొంది. ఇంటి ముందు నిలబడి ఉన్న యువతిని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో వాహనాన్ని మైనర్ నడిపినట్లు సమాచారం. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అలంపూర్ పట్టణంలో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ దేవి ఆలయాల ప్రాంగణంలో బుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని గురువారం వేద పండితులు చండీ హోమం నిర్వహించారు. హోమంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన 114 మంది భక్తులు పాల్గొన్నారు. దీంతో ఆలయాల ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో పురందర్ కుమార్ తెలిపారు.
మాడుగుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సాయి మంగళవారం ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు గ్రామస్థుల సహకారంతో మూడు మోటార్లను బిగించి నీటిని తోడిన తగ్గలేదు. చివరికి ఫైర్ సిబ్బందితో బావిలో గాలించి డెడ్ బాడీని ఈరోజు బయటకి తీశారు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ప్రేమ పేరిట వశపరచుకొని, పెళ్లికి నిరాకరించిన ఓ వ్యక్తిపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలు.. ఆత్మకూర్‌కు చెందిన రమేశ్ ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఈక్రమంలో శారీరక సంబంధం ఏర్పరచుకొని పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
చిన్నంబాయి మండలం లక్ష్మీ పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలో ఐదు నెలల కాలంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హత్యకు గురయ్యారని ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్ నిందితులను శిక్షించాలన్నారు.
కర్నూల్ మండలం చెరువులో పడి ఈనెల 19న మరణించిన ఇద్దరూ మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మహ్మద్ బాషాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులకు వివరాల ప్రకారం.. MBNR జిల్లాకు చెందిన జానకి, అరుణ వేశ్య వృత్తి కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. బాషా, జానకి మధ్య మనస్పర్థలతో బాషాను ఇతరులతో కొట్టించింది. కక్ష్య పెంచుకున్న భాష గార్గేయపురం చెరువులో జానకిని తోసేశాడు. కాపాడబోయిన అరుణ కూడా మరణించింది.
Sorry, no posts matched your criteria.