India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాల బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మహబూబ్ నగర్ స్థానానికి మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), డీకే అరుణ(BJP) పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూల్ స్థానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS), మల్లు రవి(కాంగ్రెస్), పి.భరత్ ప్రసాద్(BJP) బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
ఈనెల 28న జరిగే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. నారాయణపేట ఎంపిడివో కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లాలో మొత్తం 205 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
♥NGKL:BRS ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
♥సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఉమ్మడి జిల్లా నాయకులు
♥మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం:సంపత్
♥ఎన్నికల కోడ్ ముగిశాకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గృహజ్యోతి అమలు
♥WNPT:మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల రాజీనామాలకు ఆమోదం
♥నాకు ఎలాంటి నోటీసులు రాలేదు:MLA విజయుడు
♥ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
♥ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో తన ఎన్నిక చెల్లదని హైకోర్టు నోటీసులు పంపింది అంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. తాను చేసింది తాత్కాలిక ఉద్యోగం అని, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదని గ్రహించాలని హితవు పలికారు.
తన మీద నమ్మకంతో రానున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి BRS అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా మాజీ CM KCRకు RS ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ‘నేను మీ నమ్మకాన్ని వమ్ముచేయను. పేద ప్రజలకిచ్చిన మాట తప్పను’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు శ్రేయోభిలాషులకు బాధ పెట్టి ఉండోచ్చు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవన్నారు.
అలంపూర్‌లో సవరన్న, ప్రేమమ్మ దంపతులకు 1967లో జన్మించిన RS ప్రవీణ్ కుమార్.. ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీలో చేశారు. 1995 బ్యాచ్ IPSగా ఎంపికైన RSP స్వేరోస్ సంస్థ స్థాపించి పలు కార్యక్రమాలు చేపట్టారు. గతేడాది తన ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా BRSలో చేరి NGKL ఎంపీగా పోటీ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు శుక్రవారం ఆయన చాంబర్ లో కలిశారు. మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అంశంపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో BRS పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, పురపాలిక చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, MPTCలు BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగం అందుకున్నట్లు తెలుస్తోంది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాపాడుకునేందుకు నేతలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే వివిధ మండలాల నుంచి ఓటర్లను క్యాంప్‌కు తీసుకెళ్లగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారని సమాచారం.
ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నెకు చెందిన మౌనిక, మల్దకంటి దంపతుల బాబు జాన్సన్ లివర్ ప్రాబ్లంతో బాధ పడుతున్నాడు. వైద్యానికి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితి ఉన్నారు. వారి పెద్ద కుమార్తె లివర్ వ్యాధి బారినపడి మృతి చెందింది. మౌనికకు రెండు వారాల క్రితం పుట్టిన చిన్నారికి సైతం అదే సమస్య ఉంది. లివర్ మార్చితే బతికే అవకాశ ఉందని.. ఆర్థిక సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.