Mahbubnagar

News April 5, 2024

8న నాగర్ కర్నూల్‌కు కేటీఆర్ రాక

image

ఈ నెల 8న మాజీ మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూల్ రానున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో సమావేశం ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News April 5, 2024

NRPT: భారీగా బంగారు నగలు పట్టివేత

image

నారాయణపేటలోని సెంటర్ చౌరస్తాలో గురువారం సాయంత్రం ఏపీకి చెందిన బంగారు నగల తయారీదారుడు రాజా వద్ద భారీగా బంగారు ఆభరణాలు పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బంగారు దుకాణాలకు నగలు అందించేందుకు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా తనిఖీలు నిర్వహించామని, అతని వద్ద ఎలాంటి పత్రాలు లేని రూ.17 లక్షల విలువ గల 53.09 తులాల బంగారు ఆభరణాలు పట్టుకున్నట్లు చెప్పారు.

News April 5, 2024

అడ్డాకల్: అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు

image

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన అనిల్ గురువారం అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అనిల్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News April 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

✏MBNR&NGKL జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి జవాబు పత్రాల వాల్యుయేషన్ ✏పలుచోట్ల ఈద్గాలను పరిశీలించనున్న అధికారులు ✏పలు నియోజకవర్గంలో పర్యటించిన MBNR, NGKL ఎంపీ అభ్యర్థులు ✏నేడు ఉమ్మడి జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి ✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(FRI)-6:37,సహార్(SAT)-4:46 ✏అచ్చంపేట:నేడు BRS సన్నాహక సమావేశం ✏పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. హాజరుకానున్న నేతలు✏NRPT: నేడు రైతు సమస్యలపై BJP సత్యాగ్రహం

News April 5, 2024

జడ్చర్ల: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

image

జడ్చర్ల మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(5)పై బాలుడు(12) లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తండాలోని పాఠశాల ఆవరణలో గురువారం తోటి పిల్లలతో కలిసి బాలిక ఆడుకుంటుండగా.. అదే తండాకు చెందిన బాలుడు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆరా తీశారు. జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News April 5, 2024

NRPT: ‘అనుచిత పోస్టులు చేస్తే కఠిన చర్యలు’

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. ఇతరుల మనోభావాలు కించపరిచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్స్ అప్, ట్విట్టర్ ఇతర సామాజిక మద్యమాల్లో పోస్టులు పొట్టొద్దని, సోషల్ మీడియాపై ఐటీ, పోలీసులు నిరంతర నిఘా పెట్టారని అన్నారు.

News April 5, 2024

NGKL: ‘పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

image

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. నేడు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా మాక్ పోలింగ్ లో 50 ఓట్లకు తక్కువ కాకుండా వేయాలని, రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేసిన అనంతరం అసలైన పోలింగ్ కు సన్నద్ధం కావాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరపాలని సూచించారు.

News April 5, 2024

MBNR: ‘పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’

image

పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని
మహబూబ్ నగర్ కలెక్టర్ రవి నాయక్ ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని కలెక్టర్ చాంబర్ నుంచి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

News April 4, 2024

పాలమూరు TODAY టాప్ న్యూస్

image

✒అచ్చంపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో 10 కిలోల కణితి తొలిగింపు
✒బిజినేపల్లి:బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి
✒’తుక్కుగూడ సభను విజయవంతం చేయాలి’: కాంగ్రెస్ నేతలు
✒ట్రాక్టర్,ట్యాంకర్ ఢీ..NRPT వాసి మృతి
✒ఏప్రిల్ 6న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. సద్వినియోగం చేసుకోండి:NRPT కలెక్టర్
✒GDWL:తనిఖీల్లో..రూ.4,73,500 నగదు స్వాధీనం
✒తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్లు
✒MBNR:మళ్లీ తెరపైకి వచ్చిన MLAల కొనుగోలు ఎపిసోడ్

News April 4, 2024

సీఎం నివాసంలో పాలమూరు నేతల సమావేశం

image

హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశము నిర్వహించారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలుపు తదితర విషయాలను చర్చించామన్నారు. రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. భారీ బహిరంగ సభకు సోనియాగాంధీని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలియజేశారు.