Mahbubnagar

News March 22, 2024

మహబూబ్‌నగర్: గిరిజన గురుకులాల్లో ప్రవేశాలు

image

గిరిజన గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు నిర్దేశిత వెబ్ సైడ్ http:///tgtwgu-rukulam.telangana.gov.in ద్వారా ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News March 22, 2024

నాగర్‌కర్నూల్ ఎంపీ బరిలో ఈసారి త్రిముఖ పోటీ..!

image

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

News March 22, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఈనెల 28న జరగనున్న MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అధికారులను ఆదేశించారు. ఉపఎన్నికకు సంబంధించి నోడల్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ARO, నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఈనెల 23, 26న శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.

News March 22, 2024

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ: ఎమ్మెల్యే

image

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు, దోపిడీ పాలన పోయిందని, ప్రజా పాలన వచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని అన్నారు.

News March 22, 2024

MBNR: ‘తెలంగాణలో దోపిడి పాలన పోయి ప్రజల పాలన వచ్చింది’

image

రాష్ట్రంలో దోపిడీ పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ తదితరులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.

News March 22, 2024

వనపర్తి: టీఆర్టీపై శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్సి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు చెందిన ఎస్సీ అభ్యర్థులకు రెసిడెన్సియల్ పద్దతిలో రెండు నెలల పాటు టీఆర్టీ(DSC)పై ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ. నుశిత తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదన్నారు. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోగా http//tsstudycircle.co.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News March 21, 2024

NGKL: సంపత్‌కు NO.. మల్లు రవికి OK

image

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మల్లు రవిని అధిష్ఠానం ప్రకటించింది. ఈ సీటు కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం పట్టుబడ్డారు. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. వారి అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం టికెట్‌ను మల్లు రవికి కేటాయించింది. దీంతో కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది.

News March 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

*ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం: మంత్రి జూపల్లి
*చైనాలో గుండెపోటుతో పాలమూరు వాసి మృతి
*MBNR:కారు,బైక్ ఢీ.. కాంగ్రెస్ నేత మృతి
*జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
*NGKL:కన్న కొడుకును హత్య చేసిన తల్లి
*దేశం కోసం మోదీ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి: డీకే అరుణ
*MPగా గెలిపించండి: వంశీ చంద్ రెడ్డి
*ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు
*NRPT:పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

News March 21, 2024

అలంపూర్ ఆలయాల హుండీలు గలగల..!

image

అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీ లెక్కింపు నేడు జరగ్గా.. మొత్తం రూ.45,18,974 లు భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. జోగులాంబ హుండీలో రూ.35,75,710 లు, అలాగే బాల బ్రహ్మేశ్వర స్వామి హుండీలో రూ.5,81,150, అన్నదానం సత్రం హుండీలో రూ.62,123 వచ్చాయి. విదేశీ కరెన్సీతో పాటు 47 గ్రాముల మిశ్రమ బంగారం, 397 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు ఈవో పురందర్ కుమార్ తెలిపారు.

News March 21, 2024

‘PU సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంచాలి’

image

ఈనెల 12న పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులను ఈనెల 27 వరకు చెల్లించాలని తెలిపింది. కాగా 1, 3, 5వ సెమిస్టర్ల ఇంప్రూవ్మెంట్, రీవాల్యుయేషన్ ఫలితాలు రాకముందే 2, 4, 6వ సెమిస్టర్ల ఫీజు గడువు రావడంతో ఆయా సెమిస్టర్ల డిగ్రీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2, 4 ,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువును పెంచాలని పీయూ యూనివర్సిటీ పరీక్షల అధికారులను కోరుతున్నారు.