India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR జిల్లా రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన జ్ఞానానంద్ చైనాలో గుండెపోటుతో చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాలు.. హైదరాబాదులో నివసిస్తున్న జ్ఞానానంద్.. ఫిబ్రవరి 22న చైనాకు వెళ్ళాడు. మార్చి 17న చైనాలోని భారతీయ స్నేహితుడి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. జ్ఞానానంధ్ గుండెపోటు వచ్చిందని CPR చేసినా ప్రాణాలు దక్కలేదని చెప్పారని వారు పేర్కొన్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నారని, పంట నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, తమ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవని అన్నారు.
ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. BJP నుంచి జితేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, గద్వాల జిల్లా పురపాలక ఛైర్మన్ కేశవ్, 15 మంది వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఓటరు నాడి ఎలా ఉండనుందో చూడాలి.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకల్ మండల బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల సమాచారం.. బైపాస్ వద్ద రోడ్డు దాటుతున్న కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డి బైక్‌పై కారు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంటక్ రెడ్డి తీవ్రంగా గాయడగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు చెప్పారు. వెంకట్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. గురువారం వనపర్తి జిల్లాలోని పానగల్లో 38.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కేతపల్లిలో 38.3, గద్వాల జిల్లాలోని వడ్డేపల్లిలో 37.9, NGKL జిల్లా కోడేరులో 37.1, NRPT జిల్లాలోని ధన్వాడలో 36.9, MBNR జిల్లాలోని సేరి వెంకటాపురంలో 36.6, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా NGKL జిల్లా పద్రలో 31.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు ప్రకాశ్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ కల్చర్ టీం లీడర్‌గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అయోధ్యలో శ్రీ సీతారామ సన్నిధిలో సూర్య పర్వ్ అవార్డుతో సత్కరించారు. సూర్య పర్వ్ కార్యక్రమంలో దేశంలోని 18 రాష్ట్రాల కళాకారులు ప్రదర్శనలు నిర్వహించినట్లు ప్రకాశ్ తెలిపారు.
పాలమూరు బిడ్డగా రాష్ట్రంలోనే తొలి జాబితాలో ఎంపీ టికెట్ దక్కే అవకాశం లభించిందని, తనను గెలిపించే బాధ్యత కూడా ఇదే పాలమూరు బిడ్డలు తీసుకోవాలని CWC ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీ చంద్ రెడ్డి కోరారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. గత పది ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప అధికారులు ప్రజాప్రతినిధులకు ఎవరికీ అధికారం ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరించాలని ఆరోపించారు.
ఓ తల్లి కొడుకుని హత్య చేసిన ఘటన బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు హరీశ్(11)ను గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో రోకలి బండతో కొట్టి చంపేసింది. తర్వాత బుట్టలో చుట్టి, నీటి తొట్టిలో పడేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదికల ప్రకారం 2018 సంవత్సరంలో 12, 2021 సంవత్సరంలో 21 పులులు ఉండగా, ప్రస్తుతం 2024 సంవత్సరంలో 32 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాక చిరుత పులులు 176, ఎలుగుబంట్లు 250, ఇతర అటవీ జంతువులు 10వేల వరకు ఉన్నాయి. క్రమంగా వన్యప్రాణుల సంఖ్య పెరగటంతో పరోక్షంగా అడవి సంరక్షణకు ఉపయోగపడుతోంది.
Sorry, no posts matched your criteria.