Mahbubnagar

News April 4, 2024

‘బీజేపీకీ లక్ష ఓట్లు పైచిలుకు రావడం కాయం’

image

షాద్ నగర్ నియోజకవర్గంలో బీజేపీకీ లక్ష ఓట్లు పైచిలుకు రావడం కాయమని పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్ మున్సిపాలిటీ, ఫరూక్ నగర్ మండల బూత్ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మోడీ పాలన అంటే షాద్ నగర్ ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. మహబూబ్ నగర్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిలో నేను ముందు వరుసలో ఉంటానని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 3, 2024

వనపర్తి: ఈనెల 6న ఎన్నిక.. క్యాంప్‌కు 8 మంది కౌన్సిలర్లు !

image

వనపర్తి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈనెల 6న ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన 8 మంది కౌన్సిలర్లు క్యాంప్‌కు వెళ్లారు. వీరిలోనే పుట్టపాకల మహేశ్ ఛైర్మన్, పాకనాటి కృష్ణ వైస్ ఛైర్మన్‌ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న 9 మంది వీరికి మద్దతు ఇస్తే గెలుపుకు పక్కా అంటున్నారు.

News April 3, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAT TOP NEWS”

image

♥CM రేవంత్ రెడ్డిని కలిసిన జవాన్ యాదయ్య కుటుంబం
♥MBNR:CMను కలిసిన కిన్నెర మొగులయ్య
♥MBNR:తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్ శృతి ఓజా నియామకం
♥జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండలు
♥మద్దూర్: పెళ్లైన మూడు రోజులకే సూసైడ్
♥పలుచోట్ల వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం
♥పాలమూరు ప్రాజెక్టు గురించి రేవంత్ ఏనాడూ మాట్లాడలే: డీకే అరుణ
♥బీఆర్ఎస్ విజయం ఖాయం:RS ప్రవీణ్ కుమార్
♥సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:DSP

News April 3, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన జవాన్ యాదయ్య కుటుంబం

image

వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ యాదయ్య కుటుంబం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. యాదయ్య దుండగుల కాల్పులలో మృతిచెందగా ఆయన భార్యకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమిని భూమిని రేవంత్ రెడ్డి కేటాయించారు ఈక్రమంలో నేడు యాదయ్య భార్య పిల్లలతో వెళ్లి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ కుటుంబానికి సీఎం అండగా నిలిచారు.

News April 3, 2024

పాలమూరులో పడిపోయిన కూరగాయల సాగు !

image

ఉమ్మడి జిల్లాలో 2022-23 సంవత్సరంలో 4,670 ఎకరాల్లో రైతులు వివిధ కూరగాయలను సాగు చేశారు. 2024 సంవత్సరంలో 2,577 ఎకరాలకు సాగు పడిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యం వేల టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయి.

News April 3, 2024

బీఆర్ఎస్ విజయం ఖాయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

image

రాబోయే పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం, పదేళ్లు నిజమైన పాలన అందించిన బీఆర్ఎస్ మధ్య జరిగే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

News April 3, 2024

MBNR: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ నియామకం

image

జిల్లాలో తాగునీటి పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ శృతి ఓజాను ప్రభుత్వం నియమించింది. పాలమూరు జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. వీరు జిల్లాలో జూలై నెల వరకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు, సమస్య ఏర్పడితే పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.

News April 3, 2024

NGKL: గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్లోనే అత్యధిక మహిళా ఓటర్లు

image

నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిదిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మహిళా ఓటర్లు అత్యధికంగా గద్వాల సెగ్మెంట్లోనే ఉన్నారు. గద్వాలలో 1,30,499 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,2,282 మంది మహిళా ఓటర్లతో వనపర్తి 2వ స్థానంలో ఉంది. అచ్చంపేట 1,24,382 ఓట్లతో 3వ స్థానంలో ఉండగా, అలంపూర్లో 1,21,074, కల్వకుర్తిలో 1,20,148, కొల్లాపూర్లో 1,17,942, నాగర్ కర్నూల్‌లో 1,19,366 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

News April 3, 2024

కాంగ్రెస్ అసమర్ధతతో రాష్ట్రంలో కరువు: డీకే అరుణ

image

కాంగ్రెస్ అసమర్ధత పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్భాటాలకు పోయి ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు కరువు కోరల్లోకి నెట్టివేయబడుతోందని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు గుర్తించాలన్నారు. ఓటుతో బుద్ది చెప్పాలి, లేకపోతే మరోసారి మోసపోతారని అన్నారు.

News April 3, 2024

ఈనెల 6న పీయూలో జాతీయ సదస్సు

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 6న ‘ఎమర్జింగ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ డా.జి. జిమ్మికార్టన్, కో కన్వీనర్ డా. బి. వెంకట్ రాఘవేందర్ తెలిపారు. పీయూ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు ప్రధాన వక్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొ. టీఎల్ఎన్. స్వామి హాజరవుతున్నారని తెలిపారు.