India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నారాయణపేట జిల్లాకు చెందిన రవి కుమార్ 4/400 మీటర్ల రిలే పరుగులో గోల్డ్ మెడల్ సాధించాడు. చండీగఢ్‌లో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని అసమాన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన రవిని అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, మిత్రులు అభినందించారు.
MBNR: BRS నుంచి ఆ పార్టీ నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సమక్షంలో బుధవారం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పాటు వారి అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు.
✔పకడ్బందీగా ఎన్నికల కోడ్..పలుచోట్ల తనిఖీలు
✔పోలింగ్ కేంద్రాలపై అధికారుల దృష్టి
✔GDWL:పలు మండలాలలో కరెంట్ కట్
✔MBNR:నేడు కాంగ్రెస్ లో చేరనున్న జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ,పలు నేతలు
✔పలు నియోజక వర్గాల్లో స్థానిక MLAల పర్యటన
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(బుధ):6:35,సహార్(గురు)-5:00
✔ఓటు హక్కు పై పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔త్రాగునీటిపై హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు
✔ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా
ఉమ్మడి పాలమూరులో ఉన్న ఐదుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లలో BRS పార్టీకి ఇక ఒక్కరే మిగలనున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పటికే ముగ్గురు పార్టీలు మారగా, MBNR జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నేడు BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శాంత కుమారి ఒక్కరే BRS తమకు పదవులు ఇచ్చిందని, పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో BRSకు మరో షాక్ తగలనుంది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బుధవారం CM రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాగునీటి(భగీరథ) సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని మహబూబ్‌నగర్ సర్కిల్ ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాల ప్రజలు హెల్ప్‌లైన్ నంబర్ 08542-242024ను సంప్రదించాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సరఫరాలో అంతరాయం, లోపాలు, లీకేజీల సమస్యలు తెలియజేయొచ్చని తెలిపారు.
కన్నతల్లి కళ్ల ముందే నిర్జీవంగా మారగా.. ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో పదోతరగతి పరీక్షకు హాజరైన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. దేవరకద్ర పట్టణానికి చెందిన అంజమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. ఆమె రెండో కూతురు జ్యోతి ఓవైపు తల్లి మృతితో కన్నీటి పర్యంతం అవుతూనే.. మరోవైపు మంగళవారం జరిగిన పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.
నకిలీ ధ్రువపత్రాల అభియోగంతో కొడంగల్ వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే హైదరాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనలో 10వ తరగతి సర్టిఫికెట్ నకిలీదని రుజువు అయినట్లు సమాచారం. ఈ విషయంపై కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్‌ను వివరణ కోరగా బాలాజీ ప్రసాద్ సస్పెండైన విషయం వాస్తవమే అన్నారు.
బహుజన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు BRSలో చేరిన సందర్భంగా స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRSలో బహుజన నాయకత్వం బలంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొందరు BRS పార్టీలో లాభం పొంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు.
లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సరిహద్దు లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. నగదు మద్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. సీ విజిల్ యాప్ ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.