India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో గద్వాల జిల్లాలోని బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.11,54,200 పట్టుబడినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. వాటికి సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రూ.11 లక్షలు, కేటీ దొడ్డి మండలం నందిన్నె బార్డర్ చెక్ పోస్ట్ వద్ద రూ.54,200 సీజ్ చేశామని నగదును గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు.
గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన మమత(11) నేడు గ్రామ శివారులోని బావిలో ఈతకు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈత కొడుతున్న మమత ఎంతకీ బయటకు రాకపోవడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు వచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాదాపుగా 70 శాతం పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
ధన్వాడ: BRSకు ఓటేస్తే మీ ఓటు వృథా అయినట్లే అని బీజేపీ ఉపాధ్యక్షురాలు, MBNR ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మంగళవారం ధన్వాడ, మరికల్ మండలాలకు చెందిన బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS పని అయిపోయిందని, ఆ పార్టీకి ఓటేస్తే మీ ఓటు వృథా అవుతుందన్నారు.BJP గెలుపుపై కార్యకర్తలతో దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2019లో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో BRS గెలిచింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. పలు జిల్లాల్లో క్యాడర్ కూడా బలంగా ఉంది. MP ఎన్నికల్లో తప్పకుండా BRS గెలుస్తుందని MBNR, NGKL అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమాలో ఉన్నారు. దీనిపై మీ కామెంట్..?
గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదార- 44పై అలంపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ పై వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానాన్ని పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం, మృతుడికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తాను జాతీయహోదా తీసుకురాలేదని కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నారాయణపేటలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు పార్లమెంటులోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తాను మంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ప్రాజెక్టు సర్వే పనులు ప్రారంభానికి కృషిచేశానని అన్నారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేని మాటలు మానుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే మరో పక్క కృష్ణానదిలోని చిన్నచిన్న నీటి మడుగుల్లో నీరు తగ్గి పోవడంతో చేపలు చనిపోతున్నాయి. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణాలోని గుర్రంగడ్డ, నిజాంకొండ తదితర ప్రాంతాల్లోని నీటి మడుగుల్లో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కృష్ణా పరిసరాలు, చెరువుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున శుభకార్యాల వేళ నగదు వెంట తీసుకెళ్లేవారు పెళ్లి కార్డులు, ఆ నగదు ఏ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేశారు..? ఎంత డ్రా చేశారు..? ఏం కొనుగోలు చేయబోతున్నారు..? వంటి వాటికి ఆధారాలు చూపించాలని ఉమ్మడి జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లేవారు పేషెంట్ వివరాలు వెంట తీసుకెళ్లాలి. తర్వాత సరైన ఆధారాలు చూపించి నగదును తిరిగి పొందవచ్చని వారు సూచిస్తున్నారు.
✓ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
✓ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✓ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✓ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.
Sorry, no posts matched your criteria.