India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు పలు జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ వినియోగించాలి. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలని అన్నారు.
ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన పెబ్బేర్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయి ప్రసాద్ రెడ్డి వివరాలు.. మండల కేంద్రంలోని పాత చౌడేశ్వరి ఆలయ సమీపంలో నివసిస్తున్న సరస్వతి (29) ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల వరి కోతలు షురూ కావడంతో సోమవారం మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. మరో 684 ప్రారంభించాల్సి ఉంది. మహబూబ్ నగర్ 1.11 లక్షలు, నాగర్ కర్నూల్-1.09, నారాయణ పేట-1.15, వనపర్తి-0.91, జోగులాంబ గద్వాల-0.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనాతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమని భాజపా MBNR ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. సోమవారం మిడ్జిల్, జడ్చర్ల పట్టణాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాయని, ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చేలా బూత్ స్థాయి కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.
రాష్ట్రంలో, జిల్లాలోని ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మసీదుల అభివృద్ధితో పాటు దర్గాలో అభివృద్ధికి కూడా అధిక శాతం నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు. మైనార్టీ గురుకులాలు, పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం 128 కోట్లు కేటాయించానని, 1 కోటి నిధులతో హజ్ హౌస్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అడ్డాకల్ మండలానికి చెందిన బాలవర్ధన్ రెడ్డి హైదరాబాదులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
✏నీటి ఎద్దడి నివారణకు అధికారుల ఫోకస్
✏నేడు పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
✏పెద్ద పెద్దపల్లి: నేడు రైతు వేదికలో శాస్త్రవేత్తల సలహాలు
✏నేటి రంజాన్ వేళలు: ఇఫ్తార్(మంగళ)-6:37,సహార్(బుధ):4:48
✏పలు చోట్ల చలివేంద్రాల ఏర్పాట్లు
✏ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు
✏జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ
✏నవోదయ ఫలితాలు విడుదల
✏పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు
ఉమ్మడి జిల్లాలో వాతావరణం రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 5 వరకు ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతుంది. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. నేటి నుంచి పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేసేందుకు TSRTC సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు TSRTC లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.