Mahbubnagar

News April 1, 2024

రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

image

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేసేందుకు TSRTC సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు TSRTC లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.

News April 1, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS”

image

☞పెబ్బేరు మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
☞SDNR:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
☞MBNR: ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలతో పరారీ
☞ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రత
☞MBNR:వివాహిత సూసైడ్.. కేసు నమోదు
☞గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్లు
☞MLC ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా
☞GDWL:రేపు 5K రన్
☞ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉమ్మడి జిల్లా MLAలు
☞వరి కొనుగోలు కేంద్రాలపై ఫోకస్

News April 1, 2024

SDNR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

షాద్ నగర్ వై జంక్షన్ సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్

image

ప్రభుత్వ టీచర్లకు టెట్ ఫీవర్ పట్టుకుంది. టీచర్ ఎలిజిబిలీటీ టెస్ట్ పాస్ అయితేనే ప్రమోషన్ అని గత సంవత్సరం హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గతంలో పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. గత నోటిఫికేషన్లకు భిన్నంగా.. ఈసారి దరఖాస్తులో టీచర్లకు ప్రత్యేకంగా కాలం పెట్టీ వారి వివరాలు కూడా అడుగుతుంది. ప్రమోషన్లకు లైన్లో టీచర్లు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు.

News April 1, 2024

పెబ్బేరు మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం

image

వనపర్తి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెబ్బేరులోని మార్కెట్ యార్డు గోదాంలో మంటలు చలరేగి గన్నీ సంచులు దగ్ధం అయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మూడు ఫైర్‌ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

అడ్డాకుల: ఉచిత బస్సులో కరువు పనికి

image

అడ్డాకుల మండలం శాగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు గ్రామ శివారు కందూర్ స్టేజ్ దగ్గరకు కరువు పనులకు వెళ్లారు. పనులు పూర్తయిన వెంటనే దాదాపు 12:30కు ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన వచ్చింది. ఇంతలో మహబూబ్‌నగర్ నుంచి వనపర్తికి వెళ్లే పల్లెవెలుగు బస్సు కందూర్ స్టేజ్ దగ్గర ఆపడంతో గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు బస్సు ఎక్కారు.

News April 1, 2024

 MBNR: ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలతో పరారీ

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి పరారైన ఘటన MBNR జిల్లాలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో పంజాగుట్ట PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

News April 1, 2024

కొల్లాపూర్: అడుగంటుతున్న కృష్ణా జలాలు !

image

కృష్ణానదిలో జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ రోజురోజుకూ తగ్గుతోంది. జనవరి నెలాఖరులో 829 అడుగులు ఉన్న బ్యాక్‌ వాటర్‌ ప్రస్తుతం 811 అడుగులకు చేరుకుంది. దీంతో సాగునీటి అవసరాలకు ఇప్పటికే నీటి ఎత్తిపోతలు నిలిపివేయగా, కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు లేవని అధికారులు అంటున్నారు. మరోవైపు పంటలు ఎండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News April 1, 2024

MBNR: ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ..!

image

మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల నాయకులలో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 28న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రేపు ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు టెన్షన్‌తో ఉన్నారు. పైకి గెలుపు మీద ధీమాతో ఉన్నప్పటికీ లో లోపల మాత్రం ఆందోళనలో ఉన్నారు.

News April 1, 2024

మహబూబ్‌నగర్ జిల్లాలో భానుడి ప్రతాపం

image

ఉమ్మడి జిల్లాలో మార్చి నెలాఖరు నాటికే ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం 9 దాటితే బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా 41.8 డిగ్రీల వరకు ఎండ తీవ్రత రికార్డు అయింది. కాగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యశాఖ పేర్కొంది.