Mahbubnagar

News April 1, 2024

MBNR: మ్యాజిక్ ఫిగరెంత..? ఎవరు మాయ చెయ్యబోతున్నారు..!

image

 రేపు ఉదయం 8గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళశాలలో చేపట్టే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో గెలుపునకు మ్యాజిక్ ఫిగరెంతనేది ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రారంభించక ముందుగా చెల్లుబాటయ్యే ఓట్లను అధికారులు గుర్తిస్తారు. ఆ తర్వాతే గెలుపుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ప్రకటిస్తారు. ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్‌తో ఎవరు మాయ చెయ్యబోతున్నారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News April 1, 2024

MBNR: రేపే ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

image

MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లో ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ఈనెల 2న ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, లెక్కింపు సిబ్బంది ఉదయం 6.30 గంటల్లోగా రిపోర్టు చేయాలని ఆదేశించారు.

News April 1, 2024

అలంపూర్: త్రైమాసిక ఆదాయం రూ.2.62కోట్లు

image

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలకు వచ్చిన త్రైమాసిక ఆదాయం రూ.2,62,58,346 సమకూరిందని ఆలయ ఈఓ పురేంద్ర కుమార్ తెలిపారు. 2024 సంవత్సరంలో ఆదాయం బాగా పెరిగిందన్నారు. ఉచిత బస్సుల ప్రయాణం కారణంగా భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. వివిధ ఆర్జిత సేవ హుండి అన్నదానం ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు.

News April 1, 2024

MBNR: 80శాతం మంది టెట్ లేని టీచర్లు !

image

విద్యా శాఖ ఆధ్వర్యంలో టెట్‌కు మార్చి 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా ఏప్రిల్ 10 వరకు గడువు ఉంది. కాగా ఉమ్మడి జిల్లాలో 13,266 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వారిలో దాదాపు 80% మందికి టెట్ లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. స్పష్టత లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.

News April 1, 2024

MBNR: ‘విద్యుత్ శాఖలో ఆర్టిజన్లకు పని ఎక్కువ.. జీతాలు తక్కువ’

image

విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు పని భారం ఎక్కువ, వేతనాలు తక్కువగా ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. 2017లో రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించి వారికి సపరేట్ స్టాండింగ్ రూల్స్ ఇచ్చారు. దీంతో ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు రకాల సర్వీస్ రూల్స్ కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 వేల మంది కార్మికులు ఉన్నారు.

News April 1, 2024

NGKL: టెన్త్ పేపర్ల మూల్యాంకనానికి 1.53 లక్షల సమాధాన పత్రాలు

image

నాగర్ కర్నూల్‌లో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి సమాధాన పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమవుతుందని డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నాగర్ కర్నూలు కేంద్రానికి 1,59753 సమాధాన పత్రాలు అందాయని వెల్లడించారు. ఏప్రిల్ 3- 10 వరకు నిర్వహించే మూల్యాంకనంలో 765 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించనున్నారు.

News April 1, 2024

ఉపాధ్యాయులు పదోన్నతికి టెట్ రాయాల్సిందే..!

image

MBNR: ప్రస్తుత నిబంధనల ప్రకారం గ్రేడ్-2 ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీ, పదోన్నతులు, ఎస్జీటీలు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని MBNR జిల్లా విద్యాధికారి ఎ.రవీందర్, NGKL జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. అర్హత సాధించలేని ఉపాధ్యాయులంతా టెట్‌కు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News April 1, 2024

హన్వాడ: చికిత్స పొందుతూ యువతి మృతి

image

హన్వాడ మండలంలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. వేపూరుకు చెందిన శివాణి HYDలో ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చూపుల కోసం గురువారం ఇంటికి వచ్చిన శివాణి శుక్రవారం అస్వస్థతకు గురికాగా RMP వద్దకు వెళ్లగా కొంత నయమైంది. శనివారం నీరసంగా ఉందని మళ్లీ వెళ్తే RMP సైలెన్‌ ఎక్కించడంతో తీవ్ర చలిజ్వరం వచ్చింది. వెంటనే MBNRలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది.

News April 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

♥నేటి నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
♥పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు
♥నేటి రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(సోమ):6:37,సహార్(మంగళ):4:50
♥పలు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేల&MBNR,NGKL ఎంపీ అభ్యర్థుల పర్యటన
♥అచ్చంపేట:నేడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్
♥GDWL:నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
♥’TET ఫీజు తగ్గించాలని పలుచోట్ల నిరసనలు’
♥నేడు సమీక్ష.. రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
♥పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’!

News April 1, 2024

MBNR: జీతాలు రాక.. ఉపాధి సిబ్బంది ఇబ్బందులు

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడంలేదని తెలిపారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 155 ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నెలనెలా ఖాతాలో జీతాలు పడేటట్లు చేయాలని జాతీయ ఉపాధి హామీ సిబ్బంది కోరారు.