India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
షాద్ నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి, కార్మిక నాయకుడు బిజీ రెడ్డి దుర్మరణం చెందారు. వాహనం నడుపుకుంటూ వచ్చిన ఆయన అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆర్టీసీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
♥17 స్థానాల్లో BJPని గెలిపించండి:మోదీ
♥MBNR:ఈతకు వెళ్లి బాలుడు మృతి
♥NGKL:భార్యను చంపి భర్త ఆత్మహత్య
♥కల్వకుర్తి సమీపంలో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి
♥ఉమ్మడి జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
♥GDWL:Way2News స్పందన.. కొత్త బస్టాండ్ లో ఫ్రిడ్జ్ మరమ్మతులు
♥MLC కవిత అరెస్టుపై ఉమ్మడి జిల్లాలో ‘BRS’ నేతల నిరసన
♥WNPT:మహాలక్ష్మి క్లినిక్ తాత్కాలికంగా సీజ్!
♥మోడీ సభ..BJP శ్రేణుల్లో జోష్
నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఈరోజు జరిగిన మోదీ విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సందర్భంగా.. మోదీ మాట్లాడుతూ.. భరత్ ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మోదీతోనే దేశాభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు నాయకులు, నేతలు పాల్గొన్నారు.
భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ తన భార్య భారతిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు భారతి 5 నెలల గర్భిణి. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NGKLలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్‌కర్నూల్ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. BRS పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు.
Sorry, no posts matched your criteria.