India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనుమానాదస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన MBNR పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ స్వామి వివరాల ప్రకారం.. పాన్ సాబ్ గుట్ట ప్రాంతానికి చెందిన సందీప్ రెడ్డి (27) ఈనెల 23న సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన మిత్రుడు గణేశ్ ఇంటికి వెళ్ళాడు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. గొంతుకు ఉరితీసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, క్లూజ్ టీంతో వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు.
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉండగా.. అనంతరం అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టనున్నారు.
✒MBNR: ZPTCలు-14, MPTCలు-184, సర్పంచులు-441 ✒NGKL: ZPTCలు-20, MPTCలు-212, సర్పంచులు-461
✒GDWL:ZPTCలు-12, MPTCలు-141, సర్పంచులు-255
✒WNPT:ZPTCలు-14, MPTCలు-128, సర్పంచులు-225
✒NRPT:ZPTCలు-11, MPTCలు-142, సర్పంచులు-280 స్థానాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,176 ప్రభుత్వ పాఠశాలలుండగా, 3.01లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 15,453 ఉపాధ్యాయ పోస్టులకు 1,967 ఖాళీగా ఉన్నాయి. ఏకోపాధ్యాయుడు ఉన్నచోట పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,538 మందికి పైగా విద్యా వాలంటీర్లను నియమించారు. 20రోజుల్లో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు విద్యా వాలంటీర్ల ఊసే లేదని నిరుద్యోగులు తెలిపారు.
ప్రేమ వ్యవహారంలో పెద్దలు మందలించారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన గోపాల్‌పేట మండలం కేశంపేటలో శుక్రవారం జరిగింది. SI తిరుపతిరెడ్డి వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్(24) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియడంతో ఇంట్లో మందలించారు. దీంతో మల్లేశ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అనుమానాస్పదంగా మృతి చెందిన షాదీనగర్ కు చెందిన అరవింద్ యాదవ్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు డీకే అరుణ తెలిపారు. శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరుపగా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారని అరుణ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) మొదటి విడత దరఖాస్తుకు ఈనెల 29 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ JUNE 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT.
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ పురపాలక పరిధిలోని అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ శవం కలకలం రేపింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు శవాన్ని గమనించి అమిస్తాపూర్ ప్రాంత ప్రజలకు తెలపగా వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బండరాయితో మెది హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఆమనగల్లులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ నెల 24న పాలిసెట్-2024 నిర్వహిస్తోంది. ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 10,470 మంది విద్యార్థులకు 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.11 నుంచి మ.1.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Sorry, no posts matched your criteria.