India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD అమీర్పేట్లో అత్యాచారం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయి అత్యాచారం చేశాడు. వారికి వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి PSలో ఫిర్యాదు చేసింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్-4, 6 ఫీజులను చెల్లించాలని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ బుధవారం తెలిపారు. ఈనెల 31లోగా ఆన్లైన్ లో చెల్లించాలని, బీఏ, బీకాం వారు పేపర్ కు రూ.150, బీఎస్సీ వారు పేపర్ కు రూ.150తో పాటు ప్రాక్టికల్స్ రూ.150 చెల్లించాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్(సీబీ ఎస్ఈ-ఆంగ్ల మాధ్యమం) MPC, బైపీసీ, CEC కోర్సుల్లో ప్రవేశాలకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బాలానగర్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 19 నుంచి ఏకలవ్య ఆదర్శ పాఠశాల బాలానగర్లో విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, ఆధార్, ఫొటోలు కులం సమర్పించాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఈ నెల 10 వరకు గడువును పొడిగించినట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టరేట్ ఐడీవోసీ లో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు.
✏పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే BJP ఇవ్వలేదు:KTR
✏అమలు కానీ హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది: మన్నె శ్రీనివాస్ రెడ్డి
✏సోషల్ మీడియా పోస్టులపై నిఘా:SP గైక్వాడ్
✏BRS ప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేసింది: మంత్రి జూపల్లి
✏MBNR-13,221,NGKL-8,465 మంది ఓటర్ల తొలగింపు
✏BJPతోనే అభివృద్ధి సాధ్యం: భారత్ ప్రసాద్
✏’పాలీసెట్ గడువు పెంపు’..APPLY చేసుకోండి
✏EVM స్ట్రాంగ్ రూమ్ ల అధికారుల పరిశీలన
సార్వత్రిక ఎన్నికల సమరం మరికొన్ని రోజుల్లో జరగనుండగా ఎన్నికల సంఘం ఓటర్లకు పలు సూచనలు చేసింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్(VIS) లేనివారు వెంటనే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. దీనికోసం VOTER HELPLINE యాప్ ఇన్స్టాల్ చేసుకొని VIS డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే దీనిని చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. లేకపోతే మీ BLOని సంప్రదించాలని వెల్లడించింది.
MBNR: 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఇంటర్ కార్యాలయ అధికారులు తెలిపారు. రేపటి నుండి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని వారు తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుండి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ తెలిపిందని వారు పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మండలాల కేంద్రాలలో ప్రభుత్వ కళాశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజోలి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఉండవల్లి, కేటి దొడ్డి, ఎర్రవల్లి, సీసీ కుంట, రాజాపూర్, మహమ్మదాబాద్, మూసాపేట, ఉప్పునుంతల, కడ్తాల్, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, ఉల్కొండ, పెంట్లవల్లి, చిన్నంబావి,రేవల్లి, అమరచింత, కృష్ణ, నర్వ, మరికల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,41,794
✓ నారాయణపేట – 2,36,182
✓ మహబూబ్నగర్ – 2,59,260
✓ జడ్చర్ల – 2,22,838
✓ దేవరకద్ర – 2,39,745
✓ షాద్నగర్ – 2,38,478
✓ మక్తల్ – 2,44,173
✓ వనపర్తి – 2,73,863
✓ గద్వాల – 2,56,637
✓ అలంపూర్ – 2,40,063
✓ నాగర్కర్నూల్ – 2,36,094
✓ అచ్చంపేట – 2,47,729
✓ కల్వకుర్తి – 2,44,405
✓ కొల్లాపూర్ – 2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో వనపర్తిలో అత్యధిక ఓట్లు ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభ్యర్థులు, వారి తరఫు నాయకులు చేస్తున్న ప్రచారాలను ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబితే విని ఓట్లు వేసే పరిస్థితిలో లేకుండా పోతున్నాయి. అందరికీ జై అంటున్నారు. కానీ ఓటు ఎవరికి వేస్తారు అన్నది బయటపడడం లేదు. అటూ అభ్యర్థుల ప్రచారాల్లో కొన్ని మార్పులుచేర్పులు చేస్తూ సాగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.