India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉదయం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తుండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరి ధాన్యం రోడ్లపై ఆరబోసిన రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఉదయం వరి ధాన్యం ఆరబోసి ధాన్యం ఎండకు ముందే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉండడంతో ధాన్యం ఎండకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే సప్లమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డ్ మరో అవకాశాన్ని కల్పించింది. రూ.2000 అపరాధ రుసుంతో రేపటి వరకు ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఫీజు చెల్లించని విద్యార్థులు ఉంటే వారి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లాలో ఇంటర్ అధికారులు పేర్కొంటున్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మల్లేష్, రమాదేవి దంపతుల కూతురు సాక్షిని ప్రమాదవశాత్తు మృతి చెందింది. తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఈ సమయంలో ఇంటి ముందున్న ప్రహరీ గోడకు ఉన్న గేటు దిమ్మెను పట్టుకోగా అది బాలిక తలపై పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. అప్పటివరకు ఆడుతున్న చిన్నారి ఒక్కసారిగా కళ్లముందే విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి ఉమ్మడి జిల్లా పార్లమెంట్ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 14కు 12 MLAలను కాంగ్రెస్ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా.. సీఎం పంతం నెగ్గేనా..? అని జిల్లాలో చర్చ జోరందుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా పాత పేరు పాలమూరు అని అందరికి తెలుసు. కానీ పూర్వం జిల్లా అసలు పేరు “రుకమ్మపేట” అవి పిలిచేవారు. పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది. 1890లో నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్నగర్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఇదే పేరు కొనసాగుతోంది. రుకమ్మపేట, పాలమూరు, మహబుబ్ నగర్ వీటిలో మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి.
కర్నూల్ మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు ఆదివారం వెలుగు చూశాయి. పోలీసుల వివరాలు ప్రకారం.. చెరువులో మృతదేహాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురు మహిళలను బయటకు తీశారు. ముందు హిజ్రాలుగా భావించినా, తర్వాత మృతులు మహిళలుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు MBNRకు చెందినవారుగా గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం మూడు పోలీసుల బృందాలను నియమించారు.
✔MBNR,GDWL,NRPT జిల్లాలో పలు ప్రాంతాల్లో నేడు కరెంట్ కట్
✔సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యేలు
✔కొనసాగుతున్న వేసవి క్రీడా శిక్షణ
✔తాడూరు: నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలు
✔GDWL: నేడు లాటరీ పద్ధతిన పోస్టులు ఎంపిక
✔కల్తీ విత్తనాలపై అధికారుల ఫోకస్
లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వడంతో సర్పంచ్ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1,719 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ లోపే వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు MBNR-468 ఉండగా.. NGKL-461, GDWL-255, NRPT-280, WNP- 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఆదివారం పాలమూరు యూనివర్సిటీ వివిధ విభాగాల భవనాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.
లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డింది. జిల్లాలోని 2 నియోజకవర్గాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 13 నుంచి ఈనెల 14 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ.8.40 కోట్ల నగదు, 33,831.93 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం విలువ రూ.2.98 కోట్లు ఉంటుందని అంచనా.
Sorry, no posts matched your criteria.