Mahbubnagar

News July 9, 2024

పాలమూరు ప్రాజెక్టులకు మహర్దశ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు మహర్దశ మొదలైంది. కోయిల్ సాగర్, కల్వకుర్తి, కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల, గట్టు, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కేటాయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా కొత్త ఆయకట్టు పెంచేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

News July 9, 2024

NGKL: హర్షసాయి పేరుతో ఘరానా మోసం

image

హర్షసాయి పేరు చెప్పి మోసానికి పాల్పడిన ఘటనపై ఉప్పనుంతలలో కేసు నమోదైంది. SIలెనిన్ వివరాలు.. NLG జిల్లాకు చెందిన హనుమంత్ NGKL జిల్లా దేవదారికుంటతండాలో ఇటుకబట్టి ప్యాపారం చేస్తున్నాడు. మే14న హర్షసాయి పేరు చెప్పి ఫోన్‌ చేసి ఆర్థికసాయం చేస్తానని నమ్మించాడు. అందుకు కొంత డబ్బు ఫోన్‌పే చేయాలనగా నమ్మిన బాధితుడు రూ.54,500 పంపించాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.

News July 9, 2024

జిల్లాకు సీఎం.. 937 మంది పోలీసులతో బందోబస్తు

image

CM రేవంత్‌రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. SP డి.జానకి నేతృత్వంలో కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 937 మందితో పకడ్బందీగా భద్రతను చేపడుతున్నారు. SP, ఇద్దరు అదనపు SPలు, 8 మంది DSPలు, 35 మంది CIలు, 64 మంది SIలు, 98 మంది ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, 410 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొననున్నారు.

News July 9, 2024

MBNR: సొంత జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి నజర్!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సొంత జిల్లా కావడంతో ఇక్కడి అభివృద్ధిపై ఆయన నజర్ పెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికారులతో ఈరోజు చర్చిస్తారు.

News July 9, 2024

MBNR: సీఎం జిల్లా పర్యటన.. భారీ బందోబస్తు

image

జిల్లా కేంద్రంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌తో పాటు ఏఎస్ఎన్ గార్డెన్ సోమవారం ఎస్పీ జానకి పరిశీలించారు. ఏఎస్ఎన్ గార్డెన్లో సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.

News July 9, 2024

CM రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇలా..!

image

☞ఉదయం 12 గం.: బేగంపేట్ విమానాశ్రమం నుంచి బయలుదేరుతారు
☞12:45: మహబూబ్ నగర్ చేరుకుంటారు
☞12:45-1:00: ఉమ్మడి జిల్లా ప్రముఖులతో ముఖాముఖి
☞1:00 గం.: మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన
☞1:45-4:45: ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం
☞5:00-5:45: భూత్పూర్ ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నాయకులతో సమావేశం
☞సాయంత్రం 6 గం.: HYDకు తిరుగు ప్రయాణం

News July 9, 2024

వనపర్తికి “స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌” మంజూరు

image

నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వనపర్తికి “స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌”ను మంజూరు చేసిందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 65 ఐటీఐ సెంటర్లను స్కీల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

News July 9, 2024

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలి: ఎస్పీ

image

జిల్లాలోని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని SP రక్షిత కె మూర్తి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారులతో ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఆమె నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు.

News July 8, 2024

ఉమ్మడి పాలమూరుకు YELLOW ALERT

image

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

News July 8, 2024

పాలమూరు “TODAY TOP NEWS”

image

✒రేపు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✒ఉమ్మడి జిల్లాలో మొదలైన మొహర్రం సందడి
✒రేపు NRPTకు సినీనటి మంచు లక్ష్మి రాక
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
✒రేపు వర్షాలు ఎల్లో అలర్ట్ జారి
✒మద్దూర్:స్వామిజీ జీవసమాధి.. బయటకు తీసిన పోలీసులు
✒కొడంగల్: ఢిల్లీకి బయలుదేరిన ఒగ్గుడోలు కళాకారులు
✒ప్రజావాణి:సమస్యలపై అధికారుల ప్రత్యేక ఫోకస్
✒టీచర్లకు ఆంగ్లంపై నైపుణ్యం.. కొనసాగుతున్న శిక్షణ