Mahbubnagar

News May 18, 2024

MBNR: రూ. 60 వేలు కాజేసిన సైబర్ దుండగుడు

image

అచ్చంపేటకి చెందిన ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కి రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. SI రాము తెలిపిన వివరాలు.. పట్టణంలోని మహేంద్ర కాలనీకి చెందన అష్రఫ్ ఫోన్‌కు ఈ నెల 2న ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యి తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 60 వేలు విత్‌డ్రా అయినట్లు మిసేజ్ వచ్చింది. వెంటనే తేరుకున్న అష్రఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News May 18, 2024

MBNR: ‘రుణాలు తీసుకున్న రైతుల వివరాలు.!!’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులు రూ.2,736.76 కోట్లు రుణాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా వివరాలిలా..
✓ NGKL – 1,47,500 మంది రైతులు తీసుకున్న రుణాలు రూ.935.40 కోట్లు.
✓ MBNR – 1,23,102 మంది రైతులు, రూ.735.82 కోట్లు.
✓ గద్వాల – 95,199 మంది రైతులు, రూ.367.72 కోట్లు.
✓ నారాయణపేట – 94,359 మంది రైతులు, రూ.357.62 కోట్లు.
✓ వనపర్తి – 88,948 మంది రైతులు, రూ.340.20 కోట్లు.

News May 18, 2024

ఉమ్మడి పాలమూరులో నేడు, రేపు మోస్తరు వర్షాలు

image

ఉమ్మడి పాలమూరులో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. మధ్య ప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని వివరించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News May 18, 2024

MBNR: ఎన్నికల వేళ ఆర్టీసీకి రాబడి

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ సొంత గ్రామాలకు వచ్చి ఓట్లు వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ బస్సు డిపోలు ఈనెల 10 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు నడిపాయి. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.2.18 కోట్ల రాబడి సమకూరింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1.89 కోట్ల రాబడి వచ్చేది.

News May 18, 2024

MBNR: పూణేలో పాలమూరు యువకుడి దారుణ హత్య

image

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం అన్నారెడ్డిపల్లి తండాకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. తండాకు చెందిన శ్రీనివాస్ (22) తల్లిదండ్రులతో పాటు పూణేలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి పని ఉందని చెప్పి బయటకు వెళ్లి దారుణ హత్యకు గురైనట్లు శుక్రవారం గుర్తించారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 18, 2024

NGKL: పోలీసుల భయంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

పోలీసులు కొడతారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKLజిల్లా తెల్కపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. వెంకటయ్య (43) ఆటో నడుపుతూండేవాడు. ఈనెల 14న ఓ మహిళ ఆటోలో ఎక్కింది బంగారు గొలుసు చోరైనట్లు PSలో ఫిర్యాదు చేసింది. వెంకటయ్యను విచారించారు. మరుసటి రోజు PSకు రమ్మనగా జ్వరంతో వెళ్లలేకపోయాడు. పోలీసులు కొడతారేమోనని భయంతో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అతడి భార్య ఆరోపించారు.

News May 18, 2024

MBNR: రుణమాఫీ పై చిగురిస్తున్న ఆశలు

image

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో ఉమ్మడి పాలమూరు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ చేయకుండా ఆపేశారు. జిల్లాలో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు.

News May 18, 2024

MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే

image

వచ్చే నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. ➢కొడంగల్- పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ హాల్
➢నారాయణపేట- ఇండోర్ గ్రేమ్స్ కాంప్లెక్స్
➢మహబూబ్ నగర్- ఎగ్జామినేషన్ బ్రాంచ్ గ్రౌండ్ ఫ్లోర్
➢జడ్చర్ల- ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్
➢దేవరకద్ర- ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్
➢మక్తల్- ఇండోర్ స్టేడియం
➢షాద్‌నగర్- ఫస్ట్ ఫ్లోర్ ఫార్మాస్యూటికల్ బ్లాక్

News May 18, 2024

MBNR: పల్లెల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల చర్చ

image

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ముగియటంతో జిల్లాలోని పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల చర్చ మొదలైంది. ఫిబ్రవరి 1వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియటం, ఫిబ్రవరి 2నుంచి స్పెషలాఫీసర్ల పాలన ప్రారంభంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సీఎం జూన్లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించడంతో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు ఉండగా, సర్పంచ్ అభ్యర్థి ఎవరన్నదానిపై పల్లెల్లో చర్చ సాగుతోంది.

News May 17, 2024

MBNR: మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

HYDకార్మికనగర్‌లో వనపర్తి జిల్లాకు చెందిన <<13256242>>మేకప్ ఆర్టిస్ట్ <<>>చెన్నయ్య(తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్‌నగర్‌ వాసి సంపత్ యాదవ్(19)కు పరిచయముంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి సంపత్, చెన్నయ్య కలిసి నిమ్స్‌మే గ్రౌండ్‌లో అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈసమయంలో సంపత్ తన వద్ద ఉన్న కత్తితో చెన్నయ్యను చంపాడు. సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.