India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NGKL జిల్లా నల్లమలలోని సలేశ్వరం వరకు ఎకో టూరిజం ప్యాకేజీ ప్రవేశ పెట్టేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఏటా మూడు రోజులే అనుమతిస్తున్న సలేశ్వరం జాతరకు ఏడాదిలో 9 నెలలపాటు పర్యాటకులను అనుమతించే ప్రక్రియ మొదలైంది. సలేశ్వరం ప్రాంతంలో చెట్లను తొలిగించి మట్టిదారి నిర్మిస్తున్నారు. అయితే వాహనాలు, జన సంచారంతో ఇన్నాళ్లు కొనసాగిన ఆటవీ పరిరక్షణ, పెద్దపులులు, చిరుతల జీవనానికి ఆటంకం కలుగుతుంది.
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరేందుకు ఆసక్తిగల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన క్రీడల శాఖ అధికారి సీతారాం తెలిపారు. ఈనెల 22 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. భారత వాయుసేనలో చేరాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు agnipathvayu. cdac.in వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు
కాబోయే వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. స్థానికుల వివరాలు.. అమరచింతకు చెందిన ఓ యువతి(24) పెళ్లి ఈనెల 30న జరగాల్సి ఉంది. సాయంత్రం ఇంటికెళ్లిన సోదరుడు తలుపు కొట్టగా ఆమె తీయలేదు. దీంతో లోపలికి వెళ్లిన అతను ఆమె తల నుంచి రక్తం కారుతుండగా ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అయితే ఉరేసుకునే క్రమంలో ఫ్యాన్ కొక్కెం ఊడి కిందపడటంతో గాయాలై మృతి చెందినట్లు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటును వినియోగించుకోవడంలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శించారు. తాజా ఎంపీ ఎన్నికల్లో 4,63,983 మంది ఓటుకు దూరంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. MBNR పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 16,82,470 ఓట్లు ఉంటే 12,18,487 మంది తమ ఓటు వేశారు. 2019 MP ఎన్నికల్లో మొత్తం 13,68,868 మందికి 92,65,16 ఓట్లు పోలయ్యాయి. ఈ మధ్య 3,13,602 ఓట్లు పెరిగినప్పటికీ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ఆందోళనకరం.
PUలో డిగ్రీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన సెమిస్టర్-2 పరీక్షకు మొత్తం 11,848 మందికి గాను 11,227 మంది, సెమిస్టర్-6 పరీక్షకు 11,448 మందికి 11,108 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కొండనాగులలో ఇద్దరు, నాగర్ కర్నూల్ లో ఒకరు మాల్ ప్రాక్టీసుకు పాల్పడటంతో డిబార్ చేసినట్లు పీయూ అధికారులు తెలిపారు.
సీఎం రేవంత్ సొంత ఇలాకా మహబూబ్‌నగర్ జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 2పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా 11 పర్యాయాలు స్వయంగా పర్యటించారు. ఇందులో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న MBNR పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా పలుసార్లు వచ్చారు. జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఉమ్మడి జిల్లాలో 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు ముగిసిన రోజు నుంచి ఫలితాలు వెల్లడి కోసం 22 రోజులు నిరీక్షించాలి. దేశవ్యాప్తంగా మరో 3 దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అన్ని పూర్తయ్యాక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. నేతలు ఓటర్లు ఎక్కడ మొగ్గు చూపారో అని లెక్కలు వేసుకుంటున్నారు.
నారాయణపేటలో రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ఖాళీగా ఉన్న పంట భూములను సారవంతం చేసేందుకు రైతులు దృష్టి సారించారు. సేంద్రియ ఎరువుగా గొర్రెలు, మేకల ఎరువు భూమి సారవంతానికి ఉపయోగ పడటంతో ప్రస్తుతం గొర్రెల మందలు భూమిలో నిలుపుదల చేయించుకుంటూ భూమి సారవంతానికి రైతులు చర్యలు తీసుకుంటున్నారు. గొర్రెలు, మేకల మందలను రాత్రంతా పొలంలో నిలుపుదల చేయడం మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
నేడు హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓ హోటల్ జరిగిన జిల్లా లెవెల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చూసి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం వాసుదేవ్పూర్ గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంలో ఇద్దరూ బైక్‌పై ప్రయాణిస్తూ వాసుదేవ్ పూర్ గేటు దగ్గర ఆగి ఉన్నారు. అంతలోనే పిడుగు పడి ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా.. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రికి తరలించారు. వీరు ఆమనగల్లు మండలం చెన్నారం గ్రామానికి చెందినవారుగా సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.