Mahbubnagar

News May 16, 2024

MBNR: ఈవీఎంలలో భవితవ్యం.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. MBNR, NGKL పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీచేసిన అభ్యర్థులలో టెన్షన్ మొదలైంది. ఓటర్ నాడి అంతు చిక్కకపోవడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన ఆయా పార్టీ అభ్యర్థులలో మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పైకి మేమే గెలుస్తామని గంభీరంగా చెబుతున్నప్పటికీ విజయంపై లోలోలప టెన్షన్ నెలకొంది.

News May 16, 2024

MBNR: టెన్త్‌ సప్లిమెంటరీ రాయనున్న 5,575 మంది విద్యార్థులు

image

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. వీరిలో 39,323 పాసయ్యారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా MBNR జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా, NRPT జిల్లాలో 526 మంది ఫెయిలయ్యారు. వీరందరూ జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫెయిలైన విద్యార్థులంతా పాసయ్యేలా స్పెషల్ పోకస్ పెట్టినట్లు DEO రవీందర్ తెలిపారు.

News May 16, 2024

MBNR: మొత్తం 5,575 పదో తరగతి ఫెయిల్

image

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 39,323 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 526 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరూ జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు.

News May 16, 2024

WNP: బ్రెయిన్‌డెడ్.. ఐదుగురి జీవితాల్లో వెలుగు..

image

శ్రీరంగాపురం మండలం కంబళాపురంలో ఓ తల్లి తాను చనిపోయి మరో <<13255727>>ఐదుగురి జీవితాల్లో వెలుగులు<<>> నింపింది. లక్ష్మీదేవమ్మ(42) ఈనెల 5న కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా మరో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నిమ్స్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌తో చనిపోయారు. ఈ క్రమంలో జీవన్‌దాన్ వైద్య బృందం ఆమె భర్త, కుటుంబీకులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి.

News May 16, 2024

అంతుచిక్కని ఓటరు నాడి.. అయోమయంలో నేతలు

image

ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. దీంతో నాయకులు లెక్కల మీద లెక్కలు వేస్తూ అయోమయంలో పడ్డారు. MBNR, NGKL స్థానాల్లో గతంలో కంటే ఈసారి అధికంగా పోలింగ్ శాతం పెరిగింది. గ్రామాల వారిగా నివేదికలు తెప్పించుకుని లెక్కలు వేస్తున్నారు.

News May 16, 2024

HYDలో వనపర్తి యువకుడి దారుణ హత్య.. ట్రాన్స్‌జెండర్ల పనేనా..?

image

ఓ మేకప్ ఆర్టిస్ట్ HYDలో దారుణ హత్యకు గురయ్యాడు. బోరబండ పోలీసుల వివరాలు.. వనపర్తి జిల్లా అడ్డాకుల మం. కందూరు వాసి రవితేజ(28) యూసఫ్‌గూడలో ఉంటూ సీరియల్స్‌కు మేకప్ ఆర్టిస్టుగా చేస్తుండగా కార్మికనగర్‌‌లోని ఖాళీ స్థలంలో హత్యకు గురయ్యాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీషర్టు, చెడ్డీ ధరించిన రవి జేబులో కండోమ్స్‌ ఉన్నాయని రవిని మంగళవారం రాత్రి ట్రాన్స్‌జెండర్లు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

News May 16, 2024

‘సిబ్బందికి పారితోషకం చెల్లింపులు చేయండి’

image

MBNR: 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్ష ప్రయోగ పరీక్షలు, మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషకం చెల్లింపులు సత్వరమే జరిగేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. కానీ మార్చిలో జరిగిన పరీక్షల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషకాలు అందకపోవడం శోచనీయమన్నారు.

News May 16, 2024

అమ్రాబాద్: విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

నీట మునిగి బాలుడు మృతిచెందిన ఘటన అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్లబావిలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాలు.. పదరకు చెందిన రిషికుమార్(13) అట్చంపేట గురుకులంలో చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం వెంకటేశ్వర్ల బావిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. నిన్న గ్రామ శివారులో నీటికుంటలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రిషి నీటమునిగి చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News May 16, 2024

MBNR: విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ 2024-25 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం (ఎన్వోఎస్ఎస్)లో భాగంగా ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం.చత్రునాయక్ తెలిపారు. పీహెచీ, పోస్ట్-డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలలో విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే వారు ఇందుకు అర్హులని, ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News May 16, 2024

MBNR: డిగ్రీ దోస్త్ అడ్మిషన్లు షురూ..

image

2024-25 విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గాను ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోంది. ఈనెల 6 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తు దారులు మొదటి దశ వెబ్ఆప్షన్ ఇచ్చేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఆయా డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.