India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
PU పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ డబ్ల్యూ తదితర కోర్సులు 2,4,5,6వ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డా.రాజ్ కుమార్ తెలిపారు. 49 కేంద్రాల్లో 13,751 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల టైంటేబుల్ కోసం www.palamuru- university.com లో సందర్శించాలన్నారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 7.23 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 62.23 శాతం నమోదు కాగా ఈ ఎన్నికల్లో 69.46 శాతం నమోదైంది. ఇక్కడి నుంచి 2019లో పోతుగంటి రాములు(BRS) 1,89,748 భారీ మెజార్టీతో మల్లురవి(INC)పై గెలుపొందారు. కాగా 2024లో మల్లురవి(INC), RS ప్రవీణ్ కుమార్(BRS), పి. భరత్,(BJP), బర్రెలక్క(INDP)బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఉమ్మడి జిల్లాలో 18 మండలాల్లో నీటి కొరత ఏర్పడింది. వీటి పరిధిలో 50 శాతానికి పైగా బోరు బావులు ఎండిపోయాయి. మరో 11 మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉంటే ఆ ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నట్టుగా పేర్కొంటారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు నిరసనలకు BRS పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమే అవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో నిరసనలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న డిగ్రీ విద్యార్థుల 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాక్ పరీక్షలను ఈనెల 16 వ తేదీ నుండి ప్రారంభిస్తున్నామని పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు థియేటర్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సినిమాలు విడుదల లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపుకు ఇంటర్ బోర్డ్ మరో అవకాశం కల్పించింది. రేపటిలోగా రూ.1000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉంటే.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.
MBNR, NGKL లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. CM రేవంత్ సొంత జిల్లా, అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారని భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం 2కిలోమీటర్లకు ఎక్కువ దూరం ఉన్న గ్రామాలకు పోలింగ్ కేంద్రాలను మంజూరు చేసింది. దీనితో నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ చెంచుపెంటలో నలుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మొత్తం 10మంది ఓటర్లే ఉన్నారు. తాజా ఎంపీ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పాలమూరులో ఓటర్ల తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో 31 మంది, నాగర్ కర్నూల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. MBNRలో 7.12, NGKLలో 7.23 పోలింగ్ శాతం పెరిగింది. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
Sorry, no posts matched your criteria.