Mahbubnagar

News May 5, 2024

ఇది ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక: వంశీచంద్ రెడ్డి

image

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కాదు.. జిల్లా ఆత్మగౌరవానికి, రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో చూపించే ఎన్నిక అని మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. “ఇది పాలమూరు భవిష్యత్తు తరాల కోసం జరిగే ఎన్నిక, కేంద్రంలో BJP, రాష్ట్రంలో BRS పదేళ్లు అధికారంలో ఉండి మనల్ని బానిసలుగా చూశారని, పాలమూరు పౌరుషాన్ని చూపాలని, 13న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయాలని” కోరారు.

News May 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔GDWL: నేడు ఎర్రవల్లిలో జన జాతర.. హాజరుకానున్న రాహుల్ గాంధీ,CM రేవంత్ రెడ్డి
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ
✔త్రాగునీటి సమస్యలపై ఫోకస్
✔ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక చెక్ పోస్టులు.. కొనసాగుతున్న తనిఖీలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేడు పలువురు కాంగ్రెస్, BJPలో చేరికలు
✔MP ఎన్నికలు.. సోషల్ మీడియాపై అధికారుల దృష్టి
✔’సమ్మర్ క్రికెట్ శిబిరాల’పై నజర్

News May 5, 2024

పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు: సీఎం

image

పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన డీకే అరుణ పాలమూరు పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్ష పదవిని తెచ్చుకున్నారని విమర్శించారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డీకే అరుణ ఎందుకు అడగలేదన్నారు

News May 5, 2024

MBNR: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

image

రాష్ట్రానికి యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 2004-14 మధ్య యూపీఏ, 2014-24 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ రాశారు. కొడంగల్లో లేదా అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు రావాలన్నారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.9లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.

News May 5, 2024

ఎర్రవల్లిలో నేడు జనజాతర.. హాజరుకానున్న రాహుల్, రేవంత్

image

నేడు గద్వాల జిల్లా ఎర్రవల్లిలో జరిగే కాంగ్రెస్‌ జనజాతర సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సాయంత్రం 3.45కి సభా ప్రాంగణానికి రానున్నట్లు సంపత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష మంది జనసమీకరణకు నేతలు ప్లాన్ చేశారు. హైవే సమీపంలో సభ ఉన్నందున వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేయాలని అధికారులకు ఎస్పీ రితిరాజ్ సూచించారు.

News May 5, 2024

 BJPకి కర్రు కాల్చి వాత పెట్టాలి: CM

image

మోదీ తెచ్చింది ఏమీ లేదు గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ..”గజ్వేల్‌ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా.. పాలమూరులో కాంగ్రెస్‌ను ఓడించలేరు. పాలమూరు జిల్లాలో బీజేపీ పాతరేయాలి. వంశీని లక్ష మెజార్టీతో గెలిపించాలి’’ అని రేవంత్‌ కోరారు.

News May 5, 2024

NRPT: ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

image

పోస్టల్ ఓటుకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, ఎన్నికల విధులకు వెళ్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. నారాయణపేట గురుకుల సంక్షేమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని రెండవ రోజు శనివారం పరిశీలించారు. పొరపాట్లు జరగకుండా ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నమోదైన ఓట్ల వివరాలు తెలుసుకున్నారు.

News May 5, 2024

PUలో ఓట్ల లెక్కింపు కేంద్రం.. పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, భద్రత ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

News May 4, 2024

పాలమూరు బిడ్డను సీఎం కుర్చీ నుంచి తిప్పడానికి కుట్రలు: సీఎం

image

పాలమూరు బిడ్డను సీఎం కుర్చీ నుంచి దింపడానికి ఢిల్లీ నుంచి కొంతమంది గొడ్డలితో బయలుదేరారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్తకోటలో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి అభ్యర్థి డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినందుకా కాంగ్రెస్ పార్టీని ఓడించమంటున్నారు ప్రశ్నించారు.

News May 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే:CM రేవంత్ రెడ్డి
✏చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తా:DK అరుణ
✏నర్వ మండల వైద్యాధికారిని సస్సెండ్ చేసిన కలెక్టర్ శ్రీ హర్ష
✏NGKL:ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి!
✏పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✏BJP మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది:కాంగ్రెస్
✏GDWL:బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
✏SSC విద్యార్థులపై ఫోకస్

error: Content is protected !!