Mahbubnagar

News March 18, 2024

శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారనేది అసత్యం: డీకే అరుణ

image

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ BJPలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు DK అరుణ స్పష్టం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. BJPకి ప్రజలలో ఉన్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.

News March 18, 2024

MBNR: పాలమూరులో విస్తరిస్తోంది !

image

పాలమూరు జిల్లాలో కుష్టువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి పట్టణాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు జిల్లాలో ఈనెల 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో స్పర్శలేని ఎర్రని రాగి రంగు, గోధుమ రంగు మచ్చలు పరిశీలించడం, కాళ్లు, చేతులు మొద్దుబారడం వాటిని పరిశీలిస్తారని, సిబ్బందికి సహకరించాలని ప్రజలకు DMHO కృష్ణ సూచించారు.

News March 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల వివరాలు ఇలా..!

image

మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. MBNR-245, NRPT-205, కొడంగల్-56,WNPT-218, GDWL-225, NGKL-101, కొల్లాపూర్-67, అచ్చంపేట-79, కల్వకుర్తి-72, షాద్ నగర్-171 ఓటర్లు ఉన్నారు. 83 ZPTCలు, 888 MPTCలు, 449 వార్డు కౌన్సిలర్లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 19 ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేయనున్నారు.

News March 18, 2024

గద్వాల: పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

image

గద్వాల జిల్లా మానవపాడు మండలం చిన్న పోతులపాడుకి చెందిన ప్రవీణ్, మధు అనే టెన్త్ విద్యార్థులు ఉదయం పరీక్ష రాసేందుకు బైక్ పై స్వగ్రామం నుంచి మానవపాడులోని పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా మానవపాడు శివారులో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అటుగా వెళుతున్న ప్రయాణికులు గ్రహించి మానవపాడు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి కర్నూలుకు తరలించారు. దీంతో వారు తొలిరోజు పరీక్ష తప్పారు.

News March 18, 2024

దక్షిణ తెలంగాణకే తలమానికం మన అమ్రాబాద్ ఫారెస్ట్

image

నల్లమలలోని అమ్రాబాద్ అభయారణ్యం 2,163 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దక్షిణ తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. అడవిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఉమామహేశ్వర ఆలయాన్ని, మల్లెల తీర్థాన్ని పర్యాటక శాఖ కొంత అభివృద్ధి చేయగా.. వ్యూ పాయింట్, ఆక్టోపస్ వ్యూలను అటవీ శాఖ అభివృద్ధిలోకి తెచ్చింది.

News March 18, 2024

నాగర్ కర్నూల్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్

image

ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్(SC) పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీని పార్టీలో చేర్చుకోవడంతోపాటు ఇతర నేతల చేరికపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇప్పటికే తమ అభ్యర్థి భరత్‌ కోసం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇక్కడ తమకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై బీజేపీ లెక్కలు వేస్తోండగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఎవరన్నది తెలాల్సి ఉంది.

News March 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు..!

image

✔అంతా సిద్ధం..నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
✔ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్.. తనిఖీలు షురూ
✔NRPT:నేటి నుంచి యోగ శిబిరం ప్రారంభం
✔ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట ప్రారంభం
✔కొనసాగుతున్న కుష్టి వ్యాధుల సర్వే
✔MLC ఉప ఎన్నికలు..నేతలు బిజీ..బిజీ..
✔ప్రత్యేక చెక్ పోస్టులపై అధికారుల నిఘా
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(సోమ):6:34,సహార్(మంగళ):5:02
✔త్రాగునీటి సమస్యలపై సమీక్ష

News March 18, 2024

MBNR: ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..

image

నిన్న మొన్నటి వరకు ఎండల వేడి నీతో ఇబ్బందులు పడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సోమవారం కాస్త ఉపశమనం లభించింది. నిన్నటి వరకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుతం కూల్‌గా ఉంది.

News March 18, 2024

MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటర్లు 1,439

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 644 మంది పురుషులు, 795 మంది స్త్రీలు ఉన్నారు. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా అభ్యంతరాల స్వీకరణ, మార్పుల తర్వాత ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల ద్వారా వీరంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News March 18, 2024

MBNR: PUలో ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలు

image

పీయూ ప్రాంగణంలో కొత్తగా న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. న్యాయ కళాశాలలో మూడేళ్ల పాటు 60 సీట్లు, LLMలో 20 సీట్లు, ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తో పాటు నాలుగు కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలలు నిర్వహించేందుకు చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.