Mahbubnagar

News May 12, 2024

NRPT: 1300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులతో నారాయణపేటలోని శెట్టి ఫంక్షన్ హాలులో శనివారం సమావేశం నిర్వహించారు. విధులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 550 పోలింగ్ కేంద్రాల వద్ద 1300 మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

News May 11, 2024

MBNR: సాయత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు

image

లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోందని ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు. మే13 సాయంత్రం 6.30 నిమిషాల వరకు 144 సెక్షన్ ఉంటుందని వివరించారు.

News May 11, 2024

BJPకి పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తాం: షా

image

రాష్ట్రంలో BJPకి పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్ల రద్దు గురించి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ SC, ST, BCలను మోసం చేస్తుంది. అంబేడ్కర్‌‌కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించింది. BJP సర్కారే అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చింది’ అని అమిత్ షా పేర్కొన్నారు.

News May 11, 2024

MBNR: BRS రాష్ట్రాన్ని దోపిడీ చేసింది: డిప్యూటీ సీఎం బట్టి

image

పదేళ్లు అధికారంలో ఉన్న BRS రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. గద్వాల జిల్లా అయిజలో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. BRS నేతలు కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు దోచుకున్నారని, ప్రభుత్వ ఖజానాకు రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. BRS రాష్ట్రాని దోచుకుంటే, BJP దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టారని విమర్శించారు.

News May 11, 2024

MBNR: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

image

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని ఆయా గ్రామాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 11, 2024

MBNR: ఎన్నికల ప్రచారంలో అన్నమలై

image

తమిళనాడు BJP అధ్యక్షులు అన్నమలై ఆ పార్టీ అభ్యర్థి డీకే అరుణమ్మ‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. MBNRలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మావతి కాలనీ నుండి క్లాక్ టవర్ వరకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అభ్యర్థి డీకే అరుణమ్మతో కలిసి అన్నములై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. బీజేపీ శ్రేణులను ఉత్తేజపరిచారు.

News May 11, 2024

MBNR: సాయంత్రం నుంచి మద్యం షాప్‌లు బంద్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు వైన్ షాప్‌లు బంద్ కానున్నాయి. పోలింగ్ 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో మద్యం ప్రియులు నేడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

News May 11, 2024

ఉమ్మడి జిల్లా MP అభ్యర్థులు ఓటు వేసేది ఇక్కడే

image

వంశీచంద్ రెడ్డి(INC) NGKL నుంచి పద్మావతి కాలనీ(MBNR)లోని 113 నంబర్ పోలింగ్ బూత్ కు,DK అరుణ(BJP)GDWL నుంచి టీచర్స్ కాలనీ(MBNR) బ్రిలియంట్ స్కూల్లో 113 పోలింగ్ బూతుకు, మల్లు రవి(INC) ఖైరతాబాద్ బూత్ నంబరు 157లో, మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) నవాబుపేట(మ) గురుకుంటలోని 22వ పోలింగ్ బూత్‌లో,RS ప్రవీణ్ కుమార్(BRS)సిర్పూర్ నుంచి అలంపూర్ బూత్ నంబర్ 272లో, భరత్ ప్రసాద్(BJP) చంపాపేట్(HYD)లో ఓటు వెయ్యనున్నారు.

News May 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔’నేడు పెబ్బేరుకు ఉప ముఖ్యమంత్రి భట్టి రాక’
✔నేడు పాలమూరుకు బిజెపి బైక్ ర్యాలీ
✔నేడు వనపర్తికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
✔నేటితో ముగియనున్న ఎంపీ ఎన్నికల ప్రచారం
✔బాదేపల్లి మార్కెట్ నేడు బంద్
✔డబ్బు,మద్యం పంపిణీపై అధికారుల ఫోకస్
✔సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
✔MP ఎన్నికల EFFECT..సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారలపై నిఘా
✔పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటుపై అధికారుల దృష్టి

News May 11, 2024

బిజినేపల్లి: భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

image

అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలైన ఘటన బిజినేపల్లి మండలం మంగనూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. సంఘనమోని వెంకటయ్య రెండో భార్య తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెద్దల సమక్షంలో పలుమార్లు విన్నవించిన తీరు మారకపోవడంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య(45) తారకమ్మ(34)ను నిద్రిస్తుండగా తలపై బండ రాయితో కొట్టి హత్యచేశాడు. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.