Mahbubnagar

News May 11, 2024

NRPT: మోదీ సభతో బీజేపీలో శ్రేణుల్లో జోష్

image

నారాయణపేటలో శుక్రవారం జరిగిన బీజేపీ జనసభ, బీజేపీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ప్రధాని మొదటిసారిగా జిల్లాకు రావడంతో సర్వత్రా ఉత్సాహం వెల్లివిరిసింది. మోదీ ప్రసంగానికి యువత, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రధాని రాకకు ముందే ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. మోదీ ప్రసంగం ముగిసేంతవరకు మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది.

News May 11, 2024

MP ఎన్నికలు.. నేటితో ప్రచారానికి తెర.!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సా. 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు పాలమూరును వదిలి వెళ్లాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 31 మంది, నాగర్ కర్నూల్ పరిధిలో 19 మంది బరిలో ఉన్నారు. ఇన్ని రోజులుగా మైకులతో హోరెత్తిన పట్టణాలు, గ్రామాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొననుంది.

News May 11, 2024

బిజినేపల్లి: భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

image

అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలైన ఘటన బిజినేపల్లి మండలం మంగనూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. సంఘనమోని వెంకటయ్య రెండో భార్య తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెద్దల సమక్షంలో పలుమార్లు విన్నవించిన తీరు మారకపోవడంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య(45) తారకమ్మ(34)ను నిద్రిస్తుండగా తలపై బండ రాయితో కొట్టి హత్యచేశాడు. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 11, 2024

షాద్‌నగర్‌: పెట్టుబడులు గుజరాత్‌కు తరలించేందుకు BJP కుట్ర :CM

image

HYDకు వచ్చే పెట్టుబడులు గుజరాత్‌కు తరలించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు.

News May 11, 2024

NRPT: కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది: మోడీ

image

కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఓపెన్ చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నారాయణపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘RR అంటే ఎవరో నేను చెప్పలేదు.. కానీ సీఎం తమ పేర్లు చెప్పుకున్నాడు. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి, భద్రతకు గ్యారెంటీ. మోదీ గ్యారెంటీ అంటే అన్ని వర్గాల అభివృద్ధికి గ్యారెంటీ. రామ మందిరం కట్టడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

News May 10, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✏SDNR: కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు:CM రేవంత్‌రెడ్డి
✏పేద ప్రజలకు 3 కోట్ల ఇల్లు కట్టిస్తాం:PM మోదీ
✏NGKL:35 దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
✏ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
✏ఓటేసి మనమేంటో చూపిద్దాం.. అధికారుల పిలుపు
✏ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
✏ప్రజలకు మంచి చేయాలనే నా తపన: బర్రెలక్క
✏ఉమ్మడి జిల్లాలో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
✏పానగల్: గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి

News May 10, 2024

పాలమూరును పీడించిన చీడపీడలు మోడీ పక్కనే ఉన్నారు: సీఎం

image

పాలమూరును పీడించిన చీడపీడలు మోడీ పక్కనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీకే కుటుంబం దోపిడీ గురించి మోడీకి తెలియదా? పాలమూరు తులసివనంలో కొన్ని గంజాయి మొక్కలు మొలిచాయి. పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరు యువకులే పోటీ చేస్తున్నారు. పాలమూరు పౌరుషానికి.. ఢిల్లీ సుల్తానుల పెత్తనానికి మధ్య జరుగుతున్న పోటీ’ అని షాద్‌నగర్ రోడ్ షోలో సీఎం అన్నారు.

News May 10, 2024

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు: సీఎం రేవంత్

image

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారు. పదేళ్లు ప్రధానిగా మోదీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదు. ITIR, బయ్యారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయి. మోడీ వచ్చారు. రాష్ట్రానికి ఏమిస్తారో చెప్పలేదు. మోడీ అవినీతి గురించి మాట్లాడేటప్పుడు పక్కన ఉన్నది ఎవరో చూడాలి’ అని ఎద్దేవా చేశారు.

News May 10, 2024

BJPకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు: సీఎం రేవంత్‌రెడ్డి

image

పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ వస్తేనే పాలమూరుకు రైలు, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా. BJPకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. మోదీ మళ్లీ గెలిస్తే మనుషుల మధ్య చిచ్చు పెడతాడు. బీజేపీకి ఎవరైనా ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుంది’ అని అన్నారు.

News May 10, 2024

DK అరుణను సీఎం అవమానించారు: మోదీ

image

MBNRలో కాంగ్రెస్, BRS పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. నారాయణపేట‌ బీజేపీ సభలో‌ ఆయన ప్రసంగించారు. DK అరుణపై‌ ముఖ్యమంత్రి‌ అవమానకరమైన భాష మాట్లాడుతున్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు సమాధానం చెప్పాలని మోదీ అభ్యర్థించారు. మోదీ చౌకీదార్‌గా ఉండగా ఎవరి హక్కులు లాక్కోలేరు. డీకే అరుణకు వేసే ప్రతి ఓటు నేరుగా నా దగ్గరికి వస్తుంది’ అని అన్నారు.