India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
13న జరిగే పార్లమెంట్ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక అని MBNR కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘మనం ఎన్నో ఎన్నికలను చూసి ఉంటాం.. కానీ సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికకు చాలా తేడా ఉన్నది. ఈ ఎన్నిక కేవలం వంశీచంద్ రెడ్డికి ఇంకో అభ్యర్థికి మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. పాలమూరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన ఎన్నిక’ అని అన్నారు.
BRS పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి KCR ధనదాహానికి బలైంది. జిల్లా నుంచి కృష్ణా జలాలు వెళ్తున్నా.. ఇక్కడి భూములు ఎడారి చేశారు. ఇక్కడి కొందరు ఢిల్లీ సుల్తానులకు బానిసలయ్యారు. డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరింది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జన జాతర సభకు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పాలమూరులో ఎన్నో వనరులున్నా.. ఇక్కడి జనం వలస పోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘జోగులాంబ అమ్మవారికి నా ప్రణామాలు. గత పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్లలో తెలంగాణకు పంపిన లక్షల కోట్లు ఎటు పోయాయి? పదేళ్లలో BRS, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను లూటీ చేస్తోంది. కాళేశ్వరం విచారణకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదు’ అని నారాయణపేట బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యానించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి… అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది, మహబూబ్నగర్ కొత్తపల్లిలో 40.0, వనపర్తి జిల్లా పానగల్లో 39.9, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 39.7, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 39.3 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మహబూబ్ నగర్ MP అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరి మాటలను ఖండించాల్సిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నవ్వులు చిందించడం విస్మయం కలిగించిందన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL పార్లమెంట్ నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా అధికారులు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటేసి మనమేంటో చూపిద్దాం. మే 13న తరలిరండి అంటూ అధికారులు పిలుపునిచ్చారు.
సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11తో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు సమయం లేదు మిత్రమా’ అంటూ ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. పాంప్లెట్లు, న్యూస్ పేపర్లు, బ్రోచర్లు వంటి ప్రచారాలతో పాటు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని విస్తృతంగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్లతో వాహనాలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.
ఓ కార్మికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. MBNR జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం శంషాబాద్‌కు వచ్చి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్‌నగర్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఖలీల్ పరిచయమయ్యాడు. ఈనెల 25న పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెను బైక్‌పై వదిలేస్తానని చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు.
సార్వత్రిక సమరం 2024 తుదిదశకు చేరుకుంది. రేపటితో ప్రచారం ముగియనుండడంతో ఇంటింటికి తిరుగుతూ ఆఖరి ఓటు కూడా తమకే వేయాలని పార్టీ శ్రేణులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. గ్రామానికి ఇద్దరు చొప్పున బాధ్యులను నియమించి ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే విధంగా ఒక్కో ఓటరుకు సమయం కేటాయిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.