Mahbubnagar

News May 10, 2024

పానగల్: గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి

image

పానగల్ మండలం కేతేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ రెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. వనపర్తి టీచర్స్ కాలనీలోని స్వగృహంలో తెల్లవారుజామున బాత్రూంకి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయి మరణించినట్లు మృతుని బంధువులు తెలిపారు. ఆయన భార్య ప్రభుత్వ టీచరే. కిరణ్ మరణంతో కేతేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 10, 2024

MBNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

image

MBNR పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈనెల 13న ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మూత్రశాలలు, షామీయానాలు, తాగునీరు, ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పారామెడికల్ సిబ్బంది సేవలు అందుబాటులో ఉంచనున్నారు.

News May 10, 2024

రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. సొంత జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకునేందుకు సీఎం వ్యూహరచన చేస్తున్నారు. MBNR, NGKL పార్లమెంటు స్థానాలు ఎంతో కీలకం కావడంతో ఆయన ఈ రెండు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ రెండు స్థానాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సత్తా చాటాలని సీఎం భావిస్తున్నారు.

News May 10, 2024

వనపర్తి: భర్త, మరిది వేధింపులతో నవ వధువు సూసైడ్

image

వేధింపులతో పెళ్లైన 2నెలలకే నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన గాయత్రి(19)కు పెద్దగూడెం వాసి బాలకృష్ణతో మార్చి 13న పెళ్లైంది. ఉపాధి కోసం HYDకి వచ్చి కర్మన్‌ఘాట్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటున్న వీరితోపాటు మరిది శ్రీకాంత్ ఉంటున్నాడు. ఇద్దరి వేధింపులతో గాయత్రి పుట్టింటికి వెళ్లగా తల్లిదండ్రులు నచ్చజెప్పి 3రోజుల క్రితం తీసుకురాగా.. గురువారం ఇంట్లో ఆమె ఉరేసుకుంది.

News May 10, 2024

MBNR: హోరాహోరిగా ప్రచారం

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటులో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం చేస్తున్నారు.

News May 10, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి కార్యక్రమాలు

image

✒ఓటేసి పాలమూరు అంటే ఏంటో చూపిద్దాం.. అధికారుల పిలుపు
✒నేడు పేటకు PM మోడీ.. మక్తల్ కు CM రేవంత్ రెడ్డి రాక
✒పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోండి:DEOలు
✒పలు నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✒నేడు పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✒సరిహద్దుల్లో వాహనాల తనిఖీలపై ఫోకస్
✒వలస ఓటర్ల పై దృష్టి పెట్టిన నేతలు
✒MP ఎన్నికలు.. జోరందుకున్న ప్రచారం
✒నేటి నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ

News May 10, 2024

మారుతున్న వ్యూహాలు.. వలస ఓటర్లపై ఫోకస్

image

లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న కొద్ది నాయకులు ప్రచార వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం లెక్కలను పరిగణలోకి తీసుకుని పక్కా వ్యూహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలుపు అంచనాతో మద్దతు కూడగట్టేందుకు ఆయా పార్టీల నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీలు నువ్వా..నేనా.. అన్నట్లు వలస ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

News May 10, 2024

MBNR:14న ఎన్టీఆర్ కళాశాలలో ఉద్యోగ మేళా

image

MBNR జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. TSKC, ప్లేస్మెంట్ సెల్ సౌజన్యంతో పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఏదైనా డిగ్రీ ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, రెస్యూమ్ తో కళాశాల సెమినార్ హాల్‌లో హాజరు కావాలన్నారు.

News May 10, 2024

నేడు నారాయణపేటకు మోదీ.. మక్తల్‌కు రేవంత్

image

నేడు ఉమ్మడి జిల్లాలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ పర్యటించనున్నారు. డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో మేదీ, అదే జిల్లా మక్తల్‌లో వంశీచంద్ కోసం రేవంత్ ప్రచారం చేయనున్నారు. ఇద్దరి సభలు ఒకే సమయంలో సభలు ఉండటంతో అందరి చూపు నారాయణపేటపై పడింది. పాలమూరులో అగ్రనేతల పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఎం సొంత జిల్లా కావడంతో మోదీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. నేడు షాద్‌నగర్‌లో రేవంత్ పర్యటిస్తారు.

News May 10, 2024

MBNR: అందరికీ ఇదే సమాధానం.. అంతుచిక్కని ఓటరు నాడి..!

image

పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు, ముఖ్య నేతలకు ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ప్రచారానికి వెళ్లి ఓట్లు వేయమని అడుగుతున్న అభ్యర్థులకు ఓటర్లు తెలివిగా సరే అంటూ తలూపుతున్నారు. ప్రచారానికి వెళ్లిన అన్ని పార్టీల వారికి ఇదే విధమైన సమాధానాలు వస్తుండడంతో ఇంతకు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో తెలియక ఇటు అభ్యర్థులు.. అటు ముఖ్యమైన నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.