India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు నాగం జనార్ధన్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ పరిస్థితులపై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో M.C కేశవ రావు, కనకం బాబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కుక్కలను కాల్చి చంపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నడంతో గ్రామానికి చెందిన పలువురు ఈనెల 15న దాదాపు 20 కుక్కలను కాల్చి చంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నేడు నిందితులు నర్సింహారెడ్డి, తారిఖ్ అహ్మద్, మహమూద్ తాహీర్‌ను అరెస్ట్ చేశారు.
గద్వాల పట్టణానికి చెందిన వ్యాపారవేత్త మాక ప్రవీణ్ కుమార్ మంగళవారం గుండెపోటుకు గురై హైదరాబాదులో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాలు.. వ్యాపారం నిమిత్తం భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో దుకాణంలో గుండెపోటుకు గురయ్యాడు. దుకాణదారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గద్వాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల బలాబలాలు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1439 ఓట్లు ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు 800 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పలువురు ఎంపీటీసీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని జిల్లాలో చర్చ సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి పలుచోట్ల నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇటీవల ఎండ వేడి మీతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తున్న శంకర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. శంకర్‌ను కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో ఒకేరోజు ఏడుగురు విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఉదయం పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై ఒక్కసారిగా పిచ్చి కుక్కల స్వైర విహారం చేసి దాడి చేయడంతో దాదాపు 7గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈవిషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని తల్లిదండ్రులంటున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 1,916 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. కౌంటింగ్ కు పాలమూరు యూనివర్సిటీలో ఏడు హాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 21 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన HNKజిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఈనెల 10న HYDవచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. కాగా ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వరంగల్ జిల్లా వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి సాంబశివుడికి నెల కిందట ప్రమాదంలో కాలు విరిగింది. సోమవారం కుమారుడు తెలుగు పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులు బయ్యన్న, సుజాత మరో సహాయకుడితో మంచంతో సహా ఆటోలో కొల్లాపూర్ లోని పరీక్ష కేంద్రానికి తరలించారు. ముందస్తు అనుమతితో సాంబశివుడిని మంచంపైనే కూర్చొని పరీక్ష రాయించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.