India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR: 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం కళాశాలలో మంజూరైన ప్రతి సెక్షన్లో 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అదనపు సెక్షన్లు అవసరం అవుతే తప్పనిసరిగా ఇంటర్ బోర్డ్ అనుమతి తీసుకోవాలని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానాతో పాటు గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని అన్నారు.
NGKL జిల్లాలో 4 నెలల్లో 136 రహదారి ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదాల్లో 68 మంది మరణించగా.. 168 మంది తీవ్రంగా గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా బిజినేపల్లి మండలంలో ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. రహదారులపై వాహనాల నడుపుతున్న సమయంలో వేగాన్ని నియంత్రించలేకే ప్రమాదాల బారిన పడుతున్నారు. కాగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. MBNR లోక్ సభ పరిధిలో 2,977 మంది పురుషులు, 8385 మంది స్త్రీలు, 3 ఇతరులు కలిపి మొత్తం 15,274 మంది.. NGKL లోక్ సభ నియోజకవర్గంలో 2501 మంది పురుషులు, 4585 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 7,538 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. MBNR పరిధిలో డీకే అరుణ(BJP), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) పోటీలో ఉన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య కేవలం 4 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని సర్వేల్లో తేలడంతో ఇక్కడ సీఎం మరింత దృష్టి సారించారని టాక్. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రేవంత్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
భవనం పైకప్పు కూలి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన తాండూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బొంరాస్ పేట మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య (44) తాండూరులో కూలి పనికి వెళ్ళాడు. పనులు చేస్తుండగా పైకప్పు స్లాబు కూలి వెంకటయ్యపై కూలగా అక్కడికక్కడే మరణించాడు. జేసీబీ సహాయంతో బయటకి తీశారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని అర్థరాత్రి వరకు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించారు.
MBNR, NGKL పార్లమెంట్ పరిధిలోని ముస్లిం, మైనార్టీ ఓటర్లను తమవైపు మళ్లించుకునేందుకు నాయకులు ప్రతి రోజు వారి నివాస ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమై గెలుపు ఓటమిని నిర్ణయించిన నేపథ్యంలో ఈసారి వారి ఓట్లు తమ పార్టీకే పడేందుకు పట్టణ ప్రాంత నాయకులు శతవిధాలా యత్నిస్తున్నారు.
HYD అమీర్‌పేట్‌లో అత్యాచారం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయి అత్యాచారం చేశాడు. వారికి వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి PSలో ఫిర్యాదు చేసింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్-4, 6 ఫీజులను చెల్లించాలని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ బుధవారం తెలిపారు. ఈనెల 31లోగా ఆన్లైన్ లో చెల్లించాలని, బీఏ, బీకాం వారు పేపర్ కు రూ.150, బీఎస్సీ వారు పేపర్ కు రూ.150తో పాటు ప్రాక్టికల్స్ రూ.150 చెల్లించాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్(సీబీ ఎస్ఈ-ఆంగ్ల మాధ్యమం) MPC, బైపీసీ, CEC కోర్సుల్లో ప్రవేశాలకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బాలానగర్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 19 నుంచి ఏకలవ్య ఆదర్శ పాఠశాల బాలానగర్‌లో విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, ఆధార్, ఫొటోలు కులం సమర్పించాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఈ నెల 10 వరకు గడువును పొడిగించినట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టరేట్ ఐడీవోసీ లో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.