India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన విజయ(37)ను గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయను భర్తతోపాటు కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్సీ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న పార్టీ పరిస్థితిపై ఆమె చర్చించారు. ఈ పది రోజులు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపురం, చిన్నదర్పల్లి, నాయినోని పల్లిలో బీజేపి అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి సరిపోడు అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. ఫ్రీ బస్సు పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని అన్నారు. మహిళల మధ్య గొడవలు పెట్టకుండా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలన్నారు.
బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బిజెపి బీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. సమావేశంలో బీసీ మోర్చ నాయకులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి 34 మంది నామినేషన్ వేయగా స్క్రూటినీలో 21 మంది నామినేషన్లు ఆమోదించారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో NGKL ఎంపీ బరిలో 19 మంది నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి ఉదయ కుమార్ తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపురం, చిన్నదర్పల్లి, నాయినోని పల్లిలో బీజేపి అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి సరిపోడు అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. ఫ్రీ బస్సు పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని అన్నారు. మహిళల మధ్య గొడవలు పెట్టకుండా చిత్తశుద్ధి ఉంటే మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్వాల జిల్లా వైద్యాధికారిణి డా.శశికళ సూచించారు. వడదెబ్బకు గురికాకుండా సురక్షితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని, తప్పనిసరి పరిస్థితిల్లో బయటికి వెళ్తే తెల్లటి బట్టలు ధరిచండం, తరచుగా నీటిని తీసుకోవడం వంటివి చేయాలన్నారు.
MBNR పార్లమెంట్‌కు ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 8సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1957లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు ఎంపీగా గెలిచారు. తిరిగి 1967, 71, 77లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1980లో మల్లికార్జున్ గెలుపొందగా, తిరిగి 1989, 91, 96లో వరుసగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఈ ఇద్దరు ఎంపీలుగా 4 సార్లు ఎన్నిక కాగా వరుసగా 3సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
బల్మూర్ మండలంలోని మైలారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టపై కొనసాగుతున్న మైనింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ గత కొంతకాలంగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు మేం దూరం.. దూరం అంటూ గ్రామంలో పోస్టర్లు వెలిశాయి. గుట్ట ముద్దు.. ఓటు వద్దు అనే నినాదంతో పోస్టర్లు వేశారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో నేడు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకు సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారు అనే విషయం నేడు వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
Sorry, no posts matched your criteria.