Mahbubnagar

News April 28, 2024

వీఆర్ఏల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: కోదండరాం

image

వీఆర్ఏల సమస్యలను ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏ సమస్యలను న్యాయవాది కావలి గోవిందు నాయుడు ప్రొఫెసర్ కోదండరాం దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. ఈ కార్యక్రమంలో కాచం సత్యనారాయణ, వీఆర్ఏల ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 28, 2024

అథ్లెటిక్స్‌ పోటీల్లో నారాయణపేట క్రీడాకారుల సత్తా

image

సూర్యాపేటలో నేడు జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటారు. మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్ చాంపియన్ షిప్ అండర్-14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో బసంత్ బంగారు పథకం సాధించగా, ఉమెన్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో శ్రీలత కాంస్య పతకం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తాయి.

News April 28, 2024

MBNR: సూపర్‌హీరో‌కు CM రేవంత్ రెడ్డి సన్మానం

image

సూపర్‌హీరో‌ సాయి‌చరణ్‌‌ సాహసం పట్ల‌ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షాద్‌నగర్ పరిధి నందిగామ‌లోని ఓ ఫార్మా కంపెనీ‌లో ఈనెల 26న భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికు‌లను పదో తరగతి బాలుడు సాయిచరణ్ రిస్క్‌ చేసి కాపాడారు. ఆదివారం‌ స్థానిక MLA వీర్లపల్లి శంకర్‌ బాలుడిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.

News April 28, 2024

MBNR: ఊపందుకున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారం

image

పార్లమెంట్ ఎన్నికలకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉండడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది గుర్తులు కేటాయింపు మిగిలింది. అయినప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి‌ల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొంది.

News April 28, 2024

MBNR: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

రైలుపట్టాలు దాటుతున్న వృద్ధుడు రైలు ఢీకొని మృతి చెందిన ఘటన MBNR రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ వివరాలు.. తిమ్మసానిపల్లికి చెందిన ఎల్లయ్య (85) శనివారం దొడ్డలోనిపల్లిలో రైల్వే గేటు పడటంతో కింది నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అప్పుడే వచ్చిన మధురై ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

News April 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔సర్వం సిద్ధం.. ఉమ్మడి జిల్లాలో నేడు ఏకలవ్య గురుకుల ప్రవేశ పరీక్ష
✔GDWL,NRPT:పలు గ్రామాలలో కరెంట్ కట్
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✔MBNR,GDWL,NRPT,WNPT జిల్లాలలో రెడ్ అలర్ట్: వాతావరణ శాఖ
✔పలుచోట ఓటు హక్కు పై ర్యాలీలు
✔ఏర్పాట్లలో నిమగ్నం.. మే 1 నుంచి ‘వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు’ ప్రారంభం
✔TTC ఉత్తీర్ణత అయినవారు శిక్షణకు దరఖాస్తు చేసుకోండి!

News April 28, 2024

MBNR:  జిల్లాలో నిన్నటి ఉష్ణోగ్రతలు

image

వడ్డెమాన్ 44.2℃, జానంపేట 43.4, బాలానగర్ 43.2, కొత్తపల్లె 43.0, సల్కర్‌పేట 42.9, మహబూబ్ నగర్ 42.9, సెరివెంకటాపూర్ 42.8, మహబూబ్ నగర్ 42.5, అడ్డాకల్ 42.5, భూత్పూర్ 42.4, చిన్న చింత కుంట 42.4, దేవరకద్ర 42.2, హన్వాడ 42.2, మహమ్మదాబాద్ 42.2, కౌకుంట్ల 42.0, జడ్చర్ల 41.8, కొత్త మోల్గార 41.8, పార్పల్లి 41.4, మాచన్‌పల్లె 41.4, రాజాపూర్ 41.4, దోనూరు 40.9, నవాబుపేట 40.3, మిడ్జిల్లో 40.5℃గా నమోదైంది.

News April 28, 2024

మహమ్మదాబాద్: పంటకు ట్యాంకర్ల‌తో నీళ్లు

image

మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన రైతు అనంతయ్య తాను వేసిన వరి పంటను రక్షించుకోవాలని పొలానికి ట్యాంకర్ల‌తో నీరందిస్తున్నారు. మరో 15 రోజుల పాటు నీరందిస్తే పంట చేతికి వస్తుందని, అందుకే నీరు పోస్తున్నట్లు రైతు తెలిపారు. తనకున్న 4 ఎకరాల్లో వరి నాటినట్లు తెలిపారు. అందులో అర ఎకరానికి నీరు అందకపోవడంతో ఎండిపోతుందని గమనించి ప్రతీ రోజూ 7,8 ట్యాంకర్ల‌తో నీరందిస్తున్నట్లు తెలిపారు.

News April 28, 2024

NGKL: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేసిఆర్

image

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని BRS అధినేత KCR పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో భాగంగా శనివారం NGKLలో KCR ప్రసంగించారు. మళ్లీ BRS ప్రభుత్వం వస్తుందని అన్నారు. ‘సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు. దుర్మార్గ కాంగ్రెస్‌ పాలన పోవాలంటే BRSకు పార్లమెంట్‌ ఎన్నికల్లో మద్దతివ్వాలి. KCR చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పోరాటం చేశాను తెలంగాణ సాధించాను’ అని అన్నారు.

News April 27, 2024

MBNRలో 35,NGKLలో 21 నామినేషన్లు ఆమోదం

image

తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది. మహబూబ్ నగర్ లో7, నాగర్ కర్నూల్ లో13 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. పరిశీలన అనంతరం MBNRలో 35,NGKLలో 21 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29న ముగియనుంది.

error: Content is protected !!