Mahbubnagar

News April 26, 2024

6 గ్యారంటీలు అమలు చేసి ఓట్లు అడగాలి: DK అరుణ

image

అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి CM రేవంత్ రెడ్డి ఓట్లు అడగాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ప్రాంతంలోని ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని అందుకే ఓట్లు అడుగుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సీఎం రేవంత్ ఐదేళ్లు సంక్షేమం, అభివృద్ధి చేసి ఓట్లు అడగాలని అన్నారు. ఎన్నికుట్రలు చేసినా తన గెలుపు ఖాయమని అన్నారు.

News April 26, 2024

MBNR: ఎన్నికల అక్రమాలపై ఇలా ఫిర్యాదు చేయండి

image

ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించాలని జిల్లా రిటర్నింగ్ అధికారి రవి నాయక్ కోరారు. ఎన్నికల అక్రమాలపై సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా ఫోన్ నంబర్ 90597 97275/generalobserv-er011@gmail.com, ఎన్నికల వ్యయంపై ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్ రంగ స్వామికి 8522875617 లేదా vrswamyexpobr11pc.mbnr@gmail. ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 26, 2024

మహబూబ్‌నగర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..!

image

వంశీచంద్ రెడ్డి(INC), డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS), షేక్ మున్నా బాషా(ఏఐఎంఐఎం), జి. రాకేశ్ (ధర్మ సమాజ్ పార్టీ), శంకర్ రెడ్డి(విడుదలై చిరుతైగల్ కచ్చి), ఏ.రెహమాన్(బహుజన్ ముక్తి పార్టీ), వెంకటేశ్వర్లు(అలయన్స్ డెమోక్రసీ రిఫార్మ్స్ పార్టీ), నరేశెడ్డి(తెలంగాణ జాగీర్ పార్టీ), రవీందర్(సోషల్ జస్టిస్ పార్టీ), మహ్మద్ అల్లాఉద్దీన్(బహుజన్ సమాజ్ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు.

News April 26, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఆశ వర్కర్ మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి లింగాలకు చెందిన ఆశ వర్కర్ లీలావతి(55) మృతి చెందారు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి నాగర్ కర్నూల్ నుంచి లింగాల వైపు వెళ్తుండగా జిల్లా కేంద్రంలోని బస్సు డిపో సమీపంలో బైకు పైనుంచి కిందపడటంతో తలకు బలమైన గాయలయ్యాయి. దీంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇవాళ చనిపోయినట్లు తెలిపారు.

News April 26, 2024

మహబూబ్‌నగర్‌లో 4వసారి గులాబీ జెండా పాతేనా..?

image

MBNR లోక్ సభ స్థానంపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. వరుసగా గత మూడుసార్లు ఈ స్థానాన్ని BRS కైవసం చేసుకుంది. 2009లో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లోనూ BRS నుంచి జితేందర్ రెడ్డి, 2019లో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా గెలిచారు. 4వ సారి కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోన్న BRS.. ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

News April 26, 2024

JEE ఫలితాల్లో సత్తా చాటిన పాలమూరు బిడ్డలు

image

JEE మెయిన్స్‌లో పాలమూరు విద్యార్థులు సత్తాచాటారు. వనపర్తికి చెందిన రేహాన్ తొలి ప్రయత్నంలోనే 88వ ర్యాంక్(99.9%) సాధించాడు. MBNRకు చెందిన కార్తిక్‌సాగర్(99.83), గణేశ్(99.40), కౌషిక్(98.87), NGKL-చరణ్(99.98), చరిష్మ(99.85), కునాల్(99.79), జడ్చర-అనిరుథ్‌గౌడ్(98.63), సిద్దార్థ్(99.52), షాసాబ్ గుట్ట-చరణ్‌లాల్(94.38), కోయిలకొండ-శ్రీకాంత్ నాయక్(98.61), భూత్పూర్-సాకేత్ సింగ్(99.60) మంచి ర్యాంక్ సాధించారు.

News April 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు పాలమూరుకు మాజీ సీఎం కేసీఆర్ రాక
✔వనపర్తి:నేడు జడ్పీ సమావేశం
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇంటింటికి ఓటర్ల స్లిప్పులు పంపిణీ
✔కొనసాగుతున్న వాహన తనిఖీలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీ అభ్యర్థులు
✔పోలింగ్ కేంద్రాలపై అధికారుల ఫోకస్
✔బాలానగర్:నేటి నుంచి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమాలు
✔ఉపాధి హామీ పనులపై అధికారుల నజర్

News April 26, 2024

ఎంపీ ఎన్నికలు: MBNRలో 42.. NGKLలో 34 నామినేషన్లు

image

పాలమూరులోని 2 పార్లమెంట్ స్థానాలకు కలిపి మొత్తం 76 నామినేషన్లు దాఖలయ్యాయి. MBNRలో 42 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. NGKLలో 34 మంది 53 నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా రిటర్నింగ్ కార్యాలయాలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. నామినేషన్లు రాత్రి వరకు కొనసాగాయి. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.

News April 26, 2024

 NRPT: ఓపెన్ పరీక్షలు.. SSCలో 88, ఇంటర్‌లో 122 గైర్హాజరు

image

సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 593 మంది విద్యార్థులకు 505 మంది హాజరు కాగా 88 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు 856 మందికి 734 మంది విద్యార్థులు హాజరుకాగా 122 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు వంద శాతం విద్యార్థులు హాజరయ్యారు అని అన్నారు.

News April 26, 2024

BRS, BJP హయాంలో అభివృద్ధి శూన్యం: వంశీచంద్ రెడ్డి

image

పాలమూరు జిల్లాను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయకుండా ఆగం చేశారని, పాలమూరు జిల్లా ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు.

error: Content is protected !!