Mahbubnagar

News April 26, 2024

పాలమూరుకు కేసీఆర్ ద్రోహం చేశారు: హర్షవర్ధన్ రెడ్డి

image

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామన్న కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలకు కేసీఆర్ ద్రోహం చేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి గాలి హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాలికి వదిలేసి, ఎన్నికల ముందు బస్సు యాత్ర రోడ్డు షోల పేరుతో పాలమూరు జిల్లాకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని ఆయన మండిపడ్డారు.

News April 25, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ రెండు రోజుల పర్యటన

image

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. రేపు సా.4.30 నిమిషాలకు MBNR జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్‌లో బస చేస్తారు. 27న నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✏నేటితో ముగిసిన నామినేషన్ల పర్వం
✏BJP 400 సీట్లు సాధించడం ఖాయం: గుజరాత్ సీఎం
✏సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: SPలు
✏NGKL: ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు
✏నేడు CONGRESS,BJP,BRSలో పలువురు చేరికలు
✏ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయండి: కలెక్టర్లు
✏మతోన్మాద BJPని ఓడించాలి:CITU
✏ఉమ్మడి జిల్లాలో మలేరియా నివారణపై ర్యాలీలు
✏KCR కార్నర్ మీటింగ్‌కు తరలి రావాలి:BRS నేతలు

News April 25, 2024

NGKL: కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది: కిషన్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ పై కేవలం వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.NGKL జిల్లా కేంద్రంలో ప్రసంగిస్తూ.. 6గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయకుండా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అవి అమలు కాకపోవడం లేదని ఆరోపించారు. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం అన్నారు.

News April 25, 2024

NGKL: బీజేపీ 400 సీట్లు సాధించడం ఖాయం: గుజరాత్ సీఎం

image

దేశానికి ఒక గుర్తింపు తెచ్చి ప్రపంచ దృష్టిని దేశం వైపునకు మరల్చిన గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ అని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. గురువారం NGKL పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొని నల్లవెల్లి చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడారు. ఈసారి 400 సీట్లు సాధించి మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు.

News April 25, 2024

MBNR, NGKL స్థానాలకు ఎన్ని నామినేషన్లంటే..

image

ఉమ్మడి MBNR జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో చాలామంది నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల కీలక నేతలతో పాటు డమ్మీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. MBNR పార్లమెంటు నుంచి 19 మంది, NGKL నుంచి 15 మంది అభ్యర్థులు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపు శుక్రవారం నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 25, 2024

MBNR: ఇంటర్ ఫెయిలైన వారికి ALERT.!!

image

ఇంటర్ ఫస్ట్, సెకండియర్లో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్టియర్‌కు ఉ.9 నుంచి మ.12 వరకు, సెకండియర్‌కు మ.2.30 నుంచి సా. 5.30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజును నేటి నుంచి మే2 వరకు కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలి. దీనికి కూడా మే 2 వరకు ఛాన్స్ ఉంది.

News April 25, 2024

నామినేషన్ వేసిన మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ BRS ఎంపీ అభ్యర్థి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను కలెక్టర్ రవి నాయక్‌కు అందించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2024

NGKL: మల్లు రవి ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే..

image

NGKL పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.52.32 కోట్లు, ఆయనకు 4.5 తులాల బంగారం, సతీమణికి 87.5 తులాల బంగారు ఆభరణాలు, 10 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 52.33 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు వెల్లడించారు. రూ.4.42 కోట్ల అప్పులు, 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

News April 25, 2024

మహబూబ్‌నగర్: ప్రతి పేపర్‌కు రూ.600

image

మహబూబ్‌నగర్: రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోరుకునే ఇంటర్ విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మే 2 వరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి పేపర్‌కు రూ.600 రుసుము చెల్లించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!