Mahbubnagar

News March 17, 2024

నాగర్‌కర్నూల్‌: ఎంపీవోపై ఎంపీపీ దాడి

image

విధుల్లో ఉన్న ఎంపీవోను ఎంపీపీ ఆగ్రహంతో చెప్పుతో కొట్టిన ఘటన కోడేరులో జరిగింది. బాధితుడి వివరాలు.. పెండింగ్ బిల్లుల విషయంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇరువురు మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీపీ వెంకటరాధ దుర్భాషలాడుతూ.. నా మాట ఎందుకు వినడంలేదంటూ ఎంపీ చెప్పుతో కొట్టి ఆగ్రహంతో వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఎంపీవో శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదుతో ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేశారు.

News March 17, 2024

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్

image

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 1, 29, 021 ఓట్లు సాధించగా ఈసారి పక్కా గెలుస్తామని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు.

News March 16, 2024

గద్వాల: రెండు బైక్ ఢీ.. ఒకరి మృతి

image

రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధరూర్ మండలం అల్వాల్ పాడ్ గ్రామానికి చెందిన రమేష్ (26) అదే గ్రామానికి చెందిన రాము.. బైక్ పై ధరూర్ మండల కేంద్రానికి వెళ్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందాగా.. రాము తీవ్రంగా గాయపడ్డాడు. రాముని ఆస్పత్రికి తరలించారు.

News March 16, 2024

వెల్దండ: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

image

ఆర్టీసీ బస్సు టాలీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దండ మండలం కుట్ర గేట్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కల్వకుర్తి మండలం యంగంపల్లి గ్రామానికి చెందిన సంపత్ (22) వెల్దండ మండలం గుండాల దేవస్థానం వద్ద బొమ్మల అమ్ముకునేవాడు. సంపత్
తన నివాసానికి వెళుతుండగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

News March 16, 2024

SDNR: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగి మృతి

image

షాద్ నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి, కార్మిక నాయకుడు బిజీ రెడ్డి దుర్మరణం చెందారు. వాహనం నడుపుకుంటూ వచ్చిన ఆయన అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆర్టీసీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!

image

♥17 స్థానాల్లో BJPని గెలిపించండి:మోదీ
♥MBNR:ఈతకు వెళ్లి బాలుడు మృతి
♥NGKL:భార్యను చంపి భర్త ఆత్మహత్య
♥కల్వకుర్తి సమీపంలో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి
♥ఉమ్మడి జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
♥GDWL:Way2News స్పందన.. కొత్త బస్టాండ్ లో ఫ్రిడ్జ్ మరమ్మతులు
♥MLC కవిత అరెస్టుపై ఉమ్మడి జిల్లాలో ‘BRS’ నేతల నిరసన
♥WNPT:మహాలక్ష్మి క్లినిక్ తాత్కాలికంగా సీజ్!
♥మోడీ సభ..BJP శ్రేణుల్లో జోష్

News March 16, 2024

MBNR : మోడీ సభ సక్సెస్.. బీజేపీ నేతల్లో జోష్

image

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఈరోజు జరిగిన మోదీ విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సందర్భంగా.. మోదీ మాట్లాడుతూ.. భరత్ ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మోదీతోనే దేశాభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు నాయకులు, నేతలు పాల్గొన్నారు.

News March 16, 2024

NGKL: భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ తన భార్య భారతిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు భారతి 5 నెలల గర్భిణి. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2024

నాగర్‌కర్నూల్ ప్రజలు బీజేపీని గెలిపించాలి: మోదీ

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NGKLలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్‌కర్నూల్ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. BRS పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు.