India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. గద్వాలలో 45.7, నారాయణపేట 45.2, మహబూబ్‌నగర్‌లో 45.1, వనపర్తిలో 44.8 డిగ్రీలు రికార్డు అయింది. వచ్చే 3రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. మధ్యాహ్నం సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.
MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల BJP నేతలు బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు నియోజకవర్గాల నేతలతో ఇటీవల హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మోదీ పథకాలను వివరించాలన్నారు. పోలింగ్‌కు తేదీ దగ్గర పడుతుందని, రాబోయే రోజులు మరింత కీలకమని, అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా ఆ పార్టీ నేతలకు సూచించారు.
ఉమ్మడి పాలమూరులోని రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం MBNR పరిధిలో 4 సార్లు, NGKL పరిధిలో ఒకసారి పర్యటించారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ MLAలకు ఆమె దిశానిర్దేశం చేశారు.
ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను కోరారు. శుక్రవారం ఆమె మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి పైప్ లైన్ వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించానని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో 46.0, కొల్లాపూర్ 46.0 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. వెల్దండ, కల్వకుర్తి, జడ్చర్ల, సీసీకుంట, ధన్వాడ, కృష్ణా, కొత్తపల్లి, వడ్డేపల్లి, అయిజ, అలంపూర్ మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై.. రెడ్ అలర్ట్‌కు చేరింది.
పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ)లో పనిచేస్తున్న తాత్కాలిక బోధనేతర ఉద్యోగులకు నిర్వహిస్తామన్న పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 19న అధికారులు పీయూ బోధనేతర సిబ్బందికి పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఈ నెల 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన పరీక్షలను ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొంటూ పీయూ అధికారులు మరో సర్క్యులర్ జారీ చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 4న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి, ఇతర అధికారులు పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ సమీపంలో హెలికాప్టర్ దిగే అవకాశాలను పరిశీలించారు. అనంతరం సంకిరెడ్డిపల్లి గుంపుగట్టు వద్ద పరిశీలించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.
మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మందుబాబులు చల్లని బీర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చల్లదనం ఉన్న బీర్లు మార్కెట్‌లో కొరత ఏర్పడటంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,02,961 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 230 మద్యం దుకాణాల్లో అన్నిచోట్ల నో-స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత బీర్ల కొరత ఉండనుంది.
Sorry, no posts matched your criteria.