India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ఉమ్మడి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్
✒అదనపు EVMలు సిద్ధం:కలెక్టర్లు
✒NGKL:గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త
✒KCR ప్రచారాన్ని నిషేధిస్తే BRS ప్రభంజనం ఆగదు:RSP
✒BJP గెలిస్తే రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం: మల్లు రవి
✒పలుచోట్ల వడదెబ్బపై అవగాహన
✒ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి:DK అరుణ
✒BJP అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే ప్రమాదం:కోదండరాం
✒పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు: కలెక్టర్లు
ఉమ్మడి జిల్లాలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీసు సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు, పోస్టులు నమోదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటారు.
ఉమ్మడి జిల్లాలో భానుడి తాపానికి జనం వణికిపోతున్నారు. 2రోజులుగా జిల్లాలో 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం వరకు దీర్ఘకాల వడగాలులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
BRS అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటలు నిషేధిస్తే BRS ప్రచార ప్రభంజనం ఆగదని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆమనగల్‌లో నిర్వహించిన బంజారా గర్జన సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. KCR తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అన్నారు. ఎన్నికల సంఘం పున:పరిశీలించి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ధన్వాడలో 45.1, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 44.8, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 44.6, వనపర్తి జిల్లా మదనపూర్ లో 44.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
‘ఒక్క కేసీఆర్ గొంతు నొక్కితే లక్షలాది గొంతుకలై ప్రశ్నిస్తాం. 48 గంటలు నిషేధిస్తే నలుదిక్కులా పిక్కటిల్లేలా ప్రచారం చేస్తాం’ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నినదించారు. శ్రీరంగాపూర్లో కార్యకర్తలలో ఉత్సాహం నింపుతూ ప్రజలతో మమేకమై ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూసి రేవంత్ రెడ్డి, మోదీకి కళ్లు మండుతున్నాయని విమర్శించారు.
బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని అన్నారు. మేధావులు ఉద్యోగులు ఈ సంఘాల నాయకులు మైనార్టీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచార జోరు కనిపించడం లేదు. పోటీ చేసే అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తాల్సిన గ్రామాలు, పట్టణాల్లో ఆ హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలే. ఈ ప్రభావం ఎన్నికల ప్రచారంపై పడుతోంది. ఫలితంగా ప్రచారాన్ని ఉ.10 గం.కు ముగిస్తున్నారు . మళ్లీ సా.4 గంటల తరువాత ముందుకొస్తున్నారు. లోక్ సభ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.
మద్యం మత్తులో అతి కిరాతకంగా భార్య గొంతు కోసి చంపిన ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాములు మద్యానికి బానిసై తరచూ జ్యోతితో గొడవ పడేవాడు. దీంతో ఉదయం కూడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో భార్య జ్యోతిని అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో అంతంతమాత్రంగా ప్రచారం ఉండటంతో ఓటరు నాడి అందడం లేదు.MBNR,NGKL లోక్ సభ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండటం ఆసక్తికరంగా మారింది.కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవటం కోసం BJP,ఎట్టకేలకు వచ్చిన అధికారంపై పట్టు సాధించాలంటే సత్తా చాటుకోవడం కాంగ్రెస్,పూర్వవైభవం తెచ్చుకోవడం కోసం BRS,ఈ పరిస్థితుల్లో ఓటరు గుంభనంగా ఉండటం పార్టీలకు ఎండవేడిమితో పాటు రాజకీయ ఉక్కపోత కల్పిస్తోంది.
Sorry, no posts matched your criteria.